నేటినుండి ఈ రాశులవారికి డబ్బుల మూటలను, రాజభోగాలను ప్రకటించేసిన బుధుడు!
సెప్టెంబర్ మాసంలో అనేక ముఖ్య గ్రహాల కదలికలు అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావం చూపిస్తాయి. ఇక నేడు సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 11:30నిమిషాలకు సింహరాశిలోకి బుధ సంచారం జరుగుతుంది. సూర్యుడి రాశి అయిన సింహరాశిలోకి గ్రహాల యువరాజు బుధుడు సంచరించడం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తెస్తుంది. వారు నేటి నుంచి అపారమైన సంపదలను పొందుతారు. బుధుడి అనుగ్రహం వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆ రాశులేమిటో తెలుసుకుందాం.
వృషభరాశి
సింహరాశిలో బుధసంచారం కారణంగా నేటి నుండి వృషభరాశి వారికి కలిసొస్తుంది. వృషభ రాశి వారి కెరీర్ అభివృద్ధి చెందుతుంది. భౌతిక సంపద పెరుగుతుంది. ఈ సమయంలో ఏ పని చేపట్టినా మంచి ఫలితం ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లకు అవకాశం ఉంది.

మిధున రాశి
సింహరాశిలో బుధసంచారం కారణంగా మిధునరాశి జాతకులకు కలిసొస్తుంది. మిధునరాశి జాతకులకు ఈ సమయంలో ఏ పని చేసిన అదృష్టం వరిస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ సమయం కలిసొస్తుంది. సృజనాత్మక రంగాలలో లేదా చేతివృత్తులలో పనిచేసేవారు ఈ సమయంలో బాగా రాణిస్తారు. సింహరాశిలో బుధ గ్రహ సంచారం కారణంగా మిధున రాశి వారు ఈ సమయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. నేటి నుంచి మిధున రాశి వారికి తిరుగే ఉండదు.
సింహరాశి
సింహరాశిలో బుధ గ్రహ సంచారం కారణంగా సింహరాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. నేటి నుండి వీరికి ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోయి గణనీయమైన ఆర్థిక లాభాలు వస్తాయి . ఈ సమయంలో మీ పనితీరు మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు దూరం అవుతాయి. కుటుంబంతో సంతోషంగా గడపడానికి సమయం కేటాయిస్తే మంచిది. ఈ సమయంలో బుధుడి కారణంగా తెలివిగా వ్యవహరిస్తారు.
తులారాశి
బుధ సంచారం కారణంగా తులా రాశి వారికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ సమయంలో తులారాశి వారికి ఆర్ధిక లాభాలు కలుగుతాయి. రాబోయే రోజుల్లో మీరు చేసే ప్రతి ప్లాన్ మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యం మెరుగుగా ఉంటుంది. తులారాశి జాతకులు వ్యాపారాలలో నిలిచిపోయిన డబ్బులను మళ్ళీ తిరిగి పొందుతారు .
ధనస్సు రాశి
సెప్టెంబర్ మాసంలో జరిగే బుధ సంచారం కారణంగా ధనుస్సు రాశి వారికి శుభాలు చేకూరుతాయి. ధనుస్సు రాశి జాతకులు వర్తక వ్యాపారాలలో ఈ సమయంలో లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది..ధనుస్సు రాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications