నవంబర్ లో స్వాతి నక్షత్రంలోకి బుధుడు .. మిథున, తులారాశితో పాటు వీరికి సిరిసంపదల వర్షం!

జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు బుద్ధి, వాక్చాతుర్యం, వ్యాపారం, లెక్కలు, సంభాషణలకు కారక గ్రహం. నవంబర్ 3, 2026న బుధుడు వక్రగతి కారణంగా స్వాతి నక్షత్రంలోకి తిరిగి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం నవంబర్ 25 వరకు కొనసాగే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం తులా రాశిలో ఉండి, రాహువు పాలనలో ఉంటుంది. ఈ కాలంలో కొన్ని రాశులవారికి ఆర్థికంగా మంచి ఫలితాలు కనిపిస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు. ముఖ్యంగా ఐదు రాశులవారికి లబ్ది కలుగుతుంది..

మిథున రాశి:

బుధుడు మీకు స్వగ్రహం. ఈ సంచారం వల్ల వ్యాపారం, ఉద్యోగంలో మంచి పురోగతి కనిపిస్తుంది. కొత్త క్లయింట్లు, ఒప్పందాలు రావచ్చు. ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువ. మాటల్లోనూ, నిర్ణయాల్లోనూ స్పష్టత పెరుగుతుంది.

Mercury transit in Swati Nakshatra on 3 Nov 2026 - Special Money Gains for 5 Zodiac Signs

తులా రాశి:

బుధుడు మీ లగ్నంలో సంచరిస్తున్నందున వ్యక్తిత్వం, సంభాషణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. వ్యాపారం, భాగస్వామ్యాల్లో లాభాలు కనిపిస్తాయి. ఆర్థిక నిర్ణయాలు సక్రమంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావచ్చు.

కన్యా రాశి:

ధన భావంలో బుధుడి ప్రభావం వల్ల ఆదాయం పెరగవచ్చు. వ్యాపారం, ఉద్యోగంలో స్థిరత్వం కనిపిస్తుంది. పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెడితే మంచి ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు రాశి:

లాభ స్థానంలో ప్రభావం వల్ల ఆర్థిక లాభాలు, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా అదనపు బాధ్యతలు రావచ్చు. వ్యాపారులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి.

త్వరలో అశ్లేష నక్షత్రంలోకి కుజుడు.. కుంభంతో పాటు ఈ రాశులవారికి లక్ష్మీదేవి కటాక్షం!
త్వరలో అశ్లేష నక్షత్రంలోకి కుజుడు.. కుంభంతో పాటు ఈ రాశులవారికి లక్ష్మీదేవి కటాక్షం!

మకర రాశి:

కెరీర్‌కు సంబంధించిన భావంలో ప్రభావం వల్ల ఉద్యోగం, వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. అలోచించి తీసుకునే నిర్ణయం మీకు సత్ఫలితాలను ఇస్తుంది.

స్వాతి నక్షత్రం వాయు తత్వంతో ముడిపడి ఉండటం వల్ల సంభాషణలు, వాణిజ్య కార్యకలాపాలు ఈ కాలంలో ముఖ్యమవుతాయి. అయితే వక్రగతి కారణంగా కొన్ని నిర్ణయాలు ఆలస్యం కావచ్చు. కాబట్టి పెద్ద పెట్టుబడులు లేదా కాంట్రాక్టులు చేసే ముందు రెండుసార్లు ఆలోచించడం మంచిది.

గమనిక: జ్యోతిష్య ఫలితాలు సాధారణ సూచనలు మాత్రమే. వ్యక్తిగత కుండలి, దశా-అంతర్దశల ఆధారంగా ఫలితాలు మారవచ్చు. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞులైన జ్యోతిష్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+