బుధ గోచారం ప్రకటించింది వీరికి ఐశ్వర్యం, అన్నింటా ఆధిపత్యం!
సెప్టెంబర్ 23వ తేదీన కన్య రాశిలో బుధ సంచారం జరగబోతుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బుధ గ్రహం మేధస్సుకు ప్రతీకగా నిలిచే గ్రహం. బుధుడు కన్యారాశిలో సంచారం కారణంగా అన్ని రాశుల వారి పైన ప్రభావం కనిపిస్తుంది. అయితే బుధుడు జాతకంలో మంచి స్థానంలో ఉంటే సానుకూల ఫలితాలు, చెడు స్థానంలో ఉంటే ప్రతికూల ఫలితాలు వస్తాయి.
వృషభ రాశి
కన్య రాశిలో బుధ సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు కలిసొస్తుంది. వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో ఆర్థికపరంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో ఉన్నత స్థానాలకు వెళతారు. ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ఊహించని కొత్త అవకాశాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. పోటీదారులను గట్టిగా ఎదుర్కొంటారు. ఇది మీరు ఆధిపత్యం చెలాయించే సమయం.

మిధున రాశి
కన్య రాశిలో బుధ సంచారం కారణంగా మిధున రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మిధున రాశి వారికి పనిపై ఆధిక్యం పెరుగుతుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చేందుకు అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసేవారు భారీ లాభాలను చూస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇది అనుకూల సమయం. ఈ సమయంలో మీకు ఊహించని విధంగా డబ్బు వస్తుంది.
సింహరాశి
కన్య రాశిలో బుధ సంచారం కారణంగా సింహరాశి జాతకులకు లబ్ధి చేకూరుతుంది. సింహరాశి జాతకులు తాము అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. ఈ సమయంలో ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో విజయం సాధిస్తారు. నాయకత్వ నైపుణ్యాలను, సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇది వీరికి పూర్తిగా అనుకూల సమయం.
కన్య రాశి
కన్య రాశి జాతకులకు కన్య రాశిలో బుధ సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో కన్యారాశి జాతకుల ఎదుగుదలకు బాగా అవకాశం ఉంటుంది. ఈ సమయంలో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి, ఉద్యోగాలు చేసేవారు కూడా ఈ సమయంలో గుర్తింపును పొందుతారు.
ధనుస్సు రాశి
ధనస్సు రాశి వారికి కన్య రాశిలో బుధ సంచారం కారణంగా ప్రయోజనాలు చేకూరుతాయి. ధనుస్సు రాశి జాతకులు వృత్తి వ్యాపారాలలో ఈ సమయంలో రాణిస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇదే సరైన సమయం. నూతన ఉపాధి అవకాశాలను ఈ సమయంలో సృష్టించుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ఇదే సరైన సమయం. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications