వృషభరాశిలో బుధ సంచారం.. త్వరలో వీరింటికి డబ్బుల మూటలు ఖాయం
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడిగా బుధుడిని చెప్తారు. బుధుడు కమ్యూనికేషన్, తెలివితేటలు, తార్కిక సామర్ధ్యానికి ప్రతీకగా చెప్తారు. అటువంటి బుధుడు బలమైన స్థానంలో ఉంటే ఆ జాతకుల జీవితాలలో సానుకూల ఫలితాలు వస్తాయి. అలా కాకుండా బలహీనంగా ఉంటే జాతకులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
వృషభ రాశిలోకి బుధుడు
మే 23వ తేదీన బుధుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి సంచారం చేస్తున్నాడు. వృషభ రాశిలో బుధ సంచారం కొన్ని రాశుల వారికి సానుకూల ప్రయోజనాలను కలిగిస్తుంది. కొన్ని రాశులవారు ఇప్పుడు ఏ పని చేసినా విజయం వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభరాశి
వృషభ రాశిలో బుధ సంచారం వృషభ రాశి జాతకులకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. ఈ సమయంలో వృషభ రాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో వీరే పని చేసినా కలిసి వస్తుంది.జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో కలిసి వస్తుంది. కొత్త పనులు ప్రారంభించవచ్చు.
కర్కాటక రాశి
బుధ సంచారం కర్కాటక రాశి జాతకుల జీవితాన్ని మార్చేస్తుంది. కర్కాటక రాశి జాతకులకు భాగస్వామ్య వ్యాపారాలలో కలిసి వస్తుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
కన్యా రాశి
బుధ సంచారం కారణంగా కన్యా రాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. కన్యా రాశి వారు వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో కన్య రాశి వారు ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. ఎప్పటి నుండో వసూలు కానీ బాకీలు వసూలు అవుతాయి. భూములు వాహనాలను కొనుగోలు చేస్తారు.
ధనుస్సు రాశి
బుధ సంచారం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు కలిసి వస్తుంది. ధనుస్సు రాశి వారు ఈ సమయంలో నూతన ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వీరి వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. భూములు లేదా వాహనాలు కొనుగోలు చేస్తారు. పనిచేసే చోట మంచి గుర్తింపు ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications