కలలో పాలు ఇలా కనిపిస్తే మీ పంట పండినట్టే; ఇలా కనిపిస్తే మాత్రం కష్టాలే!!

మనిషి జీవితంపై కలల ప్రభావం ఉంటుందని స్వప్న శాస్త్రం చెప్తుంది. కలలో కనిపించే వివిధ వస్తువులు భవిష్యత్ లో జరిగే వివిధ సంకేతాలను చూపిస్తాయని చాలా మంది నమ్ముతారు. మన పురాతన కాలం నుండి, కలలు భవిష్యత్ సంఘటనలకు సంబంధించినవిగా కనిపిస్తాయి. స్వప్న శాస్త్రంలో అన్ని కలల యొక్క రహస్యాలు సవివరంగా చెప్పబడ్డాయి.

చాలామందికి పాలు కలలోకి వస్తాయి. అలా పాలు కలలోకి వస్తే ఏం జరుగుతుంది? పాలు ఎలా కలలోకి వస్తే మంచి జరుగుతుంది? పాలు కలలోకి ఎలా రాకూడదు? వంటి అనేక విషయాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. చాలామందికి కలలో పాలు మరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఇలా కనిపిస్తే అది సంతోషకరమైన భవిష్యత్తును సూచిస్తుందని, స్వప్న శాస్త్రం ప్రకారం మీరు త్వరలో కెరీర్లో మంచి పురోగతి సాధిస్తారు అని చెబుతారు.

 dream

చాలామందికి కలలో పాలు పోసినట్లుగా కనిపిస్తుంది. కలలో పాలు పోసినట్టు రావడం మంచిది కాదని చెబుతున్నారు. అలా కల వస్తే జీవితంలో త్వరలో ఏదైనా సంక్షోభం రాబోతున్నదని సూచన అని చెబుతున్నారు. కలలో పాలు పోసినట్టు వస్తే భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు.

చాలామందికి కలలో పాల పాత్ర చేతినుంచి పడిపోయినట్టుగా వస్తుంది. అలా పాల పాత్ర చేతిలోనుండి పడిపోయి, పాలు పోయినట్లుగా కల వస్తే మంచిది కాదని చెబుతున్నారు. ఇది అశుభ సంకేతంగా సూచిస్తున్నారు. చాలాసార్లు కలలో పాలల్లో చక్కెర వేసి కలుపుతున్నట్లుగా వస్తుంది. కలల శాస్త్రంలో ఇది శుభసూచకమని చెప్పబడింది. పాలల్లో పంచదార వేసి కలుపుతున్నట్లుగా వస్తే సంతోషకరమైన భవిష్యత్తుకు చిహ్నంగా చెప్పొచ్చు. భవిష్యత్తులో మంచి జరుగుతుందని ఈ కల సూచిస్తుంది.

చాలామందికి కలలో పాలు తాగినట్టుగా కనిపిస్తుంది. పాలు తాగడం చూస్తున్నట్లుగా కూడా కల వస్తుంది. ఈ కల వల్ల కూడా మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఇలా కల వస్తే పురోగతికి మార్గం సుగమం అవుతుందని, భవిష్యత్తులో మంచి జరుగుతుందని సూచన. ఇక కలలో పాలు విరిగి పోయినట్టుగా కనిపిస్తే అశుభ సూచకంగా చెబుతున్నారు.

పాలు విరిగిపోయినట్టు కలగన్న వారి జీవితాల్లో కొత్త కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని, అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. కలలో పాలు కొనుగోలు చేస్తున్నట్లుగా వస్తే ఇది శుభసూచకమని చెబుతున్నారు . ఈ కల మీ ఆరోగ్యం బాగు పడుతుందని భవిష్యత్తు సంకేతాన్ని సూచిస్తుందని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+