ఈ రాశులవారికి చంద్ర రాహువుల కష్టాల హెచ్చరిక.. డబ్బు విషయంలో జాగ్రత్త!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి పైన సానుకూల లేదా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనసును నియంత్రించే గ్రహంగా చెబుతారు. చంద్రుడు మన మానసిక స్థితి పైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు. ఇక రాహువును నీడ గ్రహంగా, గందరగోళం సృష్టించే గ్రహంగా చెబుతారు.

చంద్ర రాహువుల కలయిక
చంద్రుడు మరియు రాహువు ఒకరితో ఒకరు కలిసినప్పుడల్లా అది అన్ని రాశిచక్రాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. సెప్టెంబర్ 18 వ తేదీ నుండి చంద్ర రాహువుల కలయిక కొనసాగుతుంది. ఈ కలయిక మూడు రాశులకు కష్టాలను నష్టాలను తెచ్చిపెడుతుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Moon Rahu warning of trouble for these zodiac signs Be careful about money

మేషరాశి
చంద్రుడు రాహువు కలయిక కారణంగా మేష రాశి వారికి ప్రతికూల ప్రభావాలు వస్తాయి. మేషరాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. కార్యాలయంలోనూ ఒత్తిడి పెరుగుతుంది. మేష రాశి వారు వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంటుంది. రిటైల్ వ్యాపారంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితభాగస్వామితో కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. చట్టపరమైన చిక్కులలో పడే అవకాశం ఉంది. ఈ సమయంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి
చంద్రుడు రాహువు సంయోగం కర్కాటక రాశిలో ఉన్న వ్యక్తుల జీవితాల పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కర్కాటక రాశి జాతకులకు ఆఫీసులో సహ ఉద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇది మీ పని పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. వ్యాపారంలో నష్టాలు వస్తాయి. విద్యార్థులుగా ఉన్నవారికి చదువులో ఏకాగ్రత కుదరదు. ఫలితంగా నష్టపోతారు. ఇక కుటుంబ సభ్యులలోను విభేదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

కన్యారాశి
కన్యా రాశి వారికి చంద్రుడు రాహువు కలయిక ప్రతికూల ప్రభావాలను ఇస్తుంది. ఈ సమయంలో మీ ఆదాయంలో అనిశ్చితి కనిపిస్తుంది. పని పైన ప్రతికూల ప్రభావం పడుతుంది. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది సరైన సమయం కాదు. విద్యార్థులకు చదువులో ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+