వారంరోజుల్లో శుక్రుడి రాశిలోకి చంద్రుడు.. వీరికి మహారాజ భోగాలు!

గ్రహాల గమనంలో రాశి మార్పులు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి . ఈ క్రమంలో గ్రహాలు ఒకరాశి నుండి మరొక రాశిలోకి మారినప్పుడు, వివిధ గ్రహాలతో సంయోగం చెందటం వలన కొన్ని శుభ యోగాలను, మరికొన్ని అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. నవగ్రహాలలో చంద్రుడిది ఒక ప్రత్యేక స్థానం. చంద్రుడు మనస్సుకు కారకుడు.

తులారాశిలోకి చంద్రుడు
జూలై 31న చంద్రుడు తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ప్రభావం కొన్ని రాశులవారికి అనుకూలంగా ఉండనుంది. మరికొన్ని రాశుల వారికి అననుకూలంగా ఉంటుంది. చంద్రుడు మనస్సు, శాంతికి కారకుడు కాబట్టి ఈ మార్పు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. తులా రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ధనానికి, సంపదకు, ఆస్తికి కారకుడు. కాబట్టి చంద్రుడు తులారాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశులవారికి సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

moon transit into venus ruled libra on july 31st gives luxuries to these zodiac signs

తులారాశి
తులారాశిలో చంద్ర సంచారం కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. తులా రాశిలో చంద్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ఏవైనా కొత్త కార్యక్రమాలు ప్రారంభించటానికి ఇది మంచి తరుణం. విద్యార్థులు శుభవార్తలు వింటారు . సమాజంలో గౌరవం పెరుగుతుంది. తులారాశి వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది.

కుంభ రాశి
చంద్రుని రాశి మార్పు తులారాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వర్తక, వ్యాపారాలు చేసే వారు లాభాలను గడిస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టటానికి సరైన సమయం. ఈ రాశివారు అన్ని విషయాల్లోనూ విజయాలు సాధిస్తారు. శుభకార్యాలు జరుగుతాయి. సృజనాత్మక రంగాలలో పని చేసే వారికి ఇది శుభ సమయం.

ధనుస్సు రాశి
చంద్రుని రాశి మార్పు ధనుస్సు రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. చంద్రుడు మనస్సుకు, భావోద్వేగాలకు అధిపతి కావటంతో ఈ సమయంలో ధనుస్సు రాశి వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారి దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+