ఆ వైపే తిరిగి ఎందుకు భోజనం చేయాలి?

Posted By:
Subscribe to Oneindia Telugu

ప్రతిరోజు రెండుసార్లు భోజనము చేయాలని తైత్తిరియ బ్రాహ్మణం శెలవిస్తోంది. రెండుసార్లు మధ్యలో ఏ ఆహారమూ తీసుకోకపోతే ఉపవాసం చేసినంత ఫలితం కూడా వస్తుంది. భోజనము చేసేటప్పుడు తూర్పు దిక్కుకి తిరిగి మాత్రమే భోజనం చేయాలి.

తూర్పు దిక్కుకి తిరిగి చేయటంవల్ల ఆయుష్ను పెరుగుతుంది. అలాగే దక్షిణదిశగా తిరిగి భోజనము చేస్తే కీర్తి, ప్రతిష్టలు లభిస్తాయి. ఉత్తరంవైపు తిరిగి భోజనము చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. పడమర, దక్షిణంవైపున భోజనం చెయ్యకూడదని పురాణాలలో ఉంది.

n which side we have to face while taking food?

కనుక తూర్పు వైపు తిరిగి భోజనము చేయటం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. ఆకుల మీద, ఇనుప పీటల మీద కూర్చొని భోజనం చేయకూడదు. డబ్బుని తుమ్మి కానుగ ఆకుల్లో భోజనం చేయాలి. సన్యాసులు మాత్రం మోదుగ, తామర ఆకులో మాత్రమే భోజనం చేయాలి. భోజనానికి ముందూ, తర్వాత ఆచమనం చెయ్యాలి. భోజనం చేసే ముందు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి నమస్కరించి భుజించాలి.

జీర్ణము, జీర్ణము వాతాపి జీర్ణము" అని ఎందుకంటారు

దండకారణ్యంలోని ఇల్వలుడూ, వాతాపీ అనే రాక్షస సోదరులు, అరణ్యంలోవచ్చే పోయేవారిని మాయమాటలతో పిలుచుకు వచ్చి ఆరగిస్తుంటారు. అతిథి పూజకని భోక్తలను పిలుస్తాడు ఇల్వలుడు. వారురాక ముందే వాతాపి మేకలా మారిపోతాడు. ఇల్వలుడు మేకను కోసి వండి వడ్డిస్తాడు.

వాతాపి భోక్తల కడుపు చరుచుకుని బయటికి వస్తాడు. ఆ తర్వాత ఎంచక్కా వార్ని ఇద్దరూ కలసి భుజిస్తారు. అగస్త్యుడికి ఈ విషయం తెలిసి భోక్తలా వెళతాడు. ఎప్పటిలానే ఇల్వలుడు వాతాపిని వండి వడ్డిస్తాడు. అగస్త్యుడు భుజించిన తర్వాత ఎప్పటివలె "వాతాపీ బైటకిరా' అంటాడు. అప్పడు అగస్త్యుడు "ఇంకెక్కడి వాతాపి. ఎప్పుడో జీర్ణమయిపోయాడు. 'జీర్ణము, జీర్ణము వాతాపి జీర్ణమంటూ పొట్టను రుద్దుకుంటాడు.

అలా అగస్త్యుడు వాతాపిని జీర్ణము చేసుకొని ఇల్వలుడ్ని బూడిద చేస్తాడు. ఎంత చెడు ప్రభావం కలదైనా, అరగనిదయినా అలా అంటే కడుపులో కొండ ఉన్నా అరుగుతుందని తల్లి నమ్మకము. అందుకనే తల్లి పిల్లలకి భోజనం పెట్టి పూర్తయిన తర్వాత ఆ మాటంటుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrolger says, why shoud we to face while eating food. He described the reasons for that.
Please Wait while comments are loading...