అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్.. ఇక ఇరాన్ ఖతం..??

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. గత మూడు నెలలుగా ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికాతో శాంతి చర్చలకు ఇరాన్ ఏమాత్రం ముందుకు రావడం లేదు. తాజాగా మరోసారి ఇరాన్ మరోసారి సంచలన ప్రకటన చేసింది. అమెరికాతో శాంతి ఒప్పందం జరగబోదని తేల్చి చెప్పింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ హౌసింగ్ ఫైనాన్స్ ఏజెన్సీ (FHFA) డైరెక్టర్ బిల్ పుల్టేను తాత్కాలిక జాతీయ నిఘా డైరెక్టర్ (DNI)గా నియమించారు.

జాతీయ భద్రతలో అనుభవం తక్కువగా ఉన్నా.. తన సన్నిహిత మిత్రుడు పుల్టేకు ఈ కీలక బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ద్వారా ఈ నియామకాన్ని వెల్లడించారు. పుల్టే DNI గా బాధ్యతలు చేపట్టినా.. FHFA డైరెక్టర్‌ గా, మార్ట్‌ గేజ్ దిగ్గజాలు ఫ్యాన్నీ మే, ఫ్రెడ్డీ మ్యాక్‌ లకు చైర్మన్‌ గా కొనసాగుతారని ట్రంప్ స్పష్టం చేశారు. 38 ఏళ్ల పుల్టే "అమెరికాలోని అత్యంత సున్నితమైన అంశాలను" సమర్థంగా నిర్వహించారని.. $10 ట్రిలియన్లకు పైగా వారి ఆస్తులను పర్యవేక్షించారని ట్రంప్ ప్రశంసించారు.

పుల్టే.. మాజీ కాంగ్రెస్ సభ్యురాలు తులసి గబ్బార్డ్‌ స్థానంలో బాధ్యతలు చేపట్టారు. గబ్బార్డ్‌ తన భర్త క్యాన్సర్ నిర్ధారణతో గత నెలలో పదవికి రాజీనామా చేశారని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ప్రస్తుతం ఇరాన్‌ తో కొనసాగుతున్న సంఘర్షణ మధ్య, జాతీయ భద్రత ప్రణాళికకు ఈ DNI పదవి అత్యంత కీలకం. ఈ నియామకం శాశ్వత నామినీని సెనేట్ ఆమోదించే వరకు తాత్కాలికంగా ఉంటుంది.

పుల్టే వృత్తి నేపథ్యం హోమ్ ఫైనాన్స్‌ లో తప్ప, నిఘా లేదా సైనిక రంగాలలో లేదు. ఈ పాత్రకు ఆయన జాతీయ భద్రతా నైపుణ్యం ఏమిటో స్పష్టంగా లేదని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. పుల్టే గ్రూప్ వ్యవస్థాపకుడి మనవడైన బిల్ పుల్టే.. ట్రంప్ ప్రభుత్వంలో అత్యంత విధేయులలో ఒకరుగా పేరుపొందారు. CNN నివేదిక ప్రకారం.. ఆయన FHFA డైరెక్టర్‌ గా తన స్థానాన్ని ఉపయోగించి, ట్రంప్ విమర్శకులైన పలువురు ప్రముఖులపై నేరారోపణలు చేశారు.

BillPulte Appointed US Director of National Intelligence by Trump Amid Escalating IranWar BillPulte

వీరిలో న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్, సెనేటర్ ఆడమ్ షిఫ్, ప్రతినిధి ఎరిక్ స్వాల్వెల్, ఫుల్టన్ కౌంటీ జిల్లా అటార్నీ ఫాని విల్లిస్, ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ లిసా కూక్ ఉన్నారు. అయితే వారంతా ఈ ఆరోపణలను ఖండించారు. కొన్ని విచారణలు అపరిష్కృతంగా ఉండగా, మరికొన్ని కొట్టివేశారు. పుల్టేకు పరిమిత నిఘా నేపథ్యం.. ట్రంప్ రాజకీయ ఎజెండాతో సన్నిహిత సంబంధాల కారణంగా ఈ నియామకంపై విస్తృత పరిశీలన ఎదురవడం ఖాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+