భోగి నుండి నవపంచమ రాజయోగంతో వీరే మహర్జాతకులు!
ప్రతి ఒక్కరికి మన జాతకం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. 2025 సంవత్సరంలో గ్రహాలు గమనం కారణంగా అన్ని రాశుల వారి జీవితాలు ప్రభావితం అవుతున్నాయి. జనవరి నెలలో చాలా ముఖ్యమైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి. అటువంటి రాజయోగాలలో నవ పంచమ రాజయోగం అత్యంత శక్తివంతమైన రాజయోగంగా ఉంది. కుజుడి కారణంగా ఏర్పడే ఈ రాజయోగంతో కొన్ని రాశుల వారికి లబ్ది జరుగుతుంది.
భోగి నాడు నవపంచమ రాజయోగం
భోగి రోజున కుజుడు, శుక్రుడు ఒకదానికొకటి 120 డిగ్రీల కోణంలో రావడం వల్ల నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. జనవరి 13వ తేదీన తెల్లవారుజామున రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ఏర్పడే ఈ నవ పంచమ రాజయోగంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. నవ పంచమ రాజయోగంతో ప్రయోజనాలను పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి నవ పంచమ రాజయోగం అనేక ప్రయోజనాలను ఇస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక విషయాల పైన ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో స్టేటస్ పెరుగుతుంది. ఉద్యోగాలు మారాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
కన్యారాశి
కన్య రాశిలో జన్మించిన వారికి నవ పంచమ రాజయోగం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో కన్యారాశి జాతకుల కోరికలు నెరవేరుతాయి. కోర్టు కేసులలో అనుకూలమైన తీర్పులు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఇది కన్యా రాశి వారికి అదృష్ట సమయం.
తులారాశి
తులారాశిలో జన్మించిన వారికి నవ పంచమ రాజయోగం కారణంగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాజయోగం జీవితంలో గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. తులా రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగాలు మారాలనుకునే వారికి ఇది మంచి సమయం. తులా రాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో సంతృప్తికరంగా ఉంటుంది. వారి ప్రతిభ నిరూపించుకోవడానికి తులారాశి వారికి అవకాశం ఉంటుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications