నవ పంచమ రాజయోగంతో నక్కతోక తొక్కిన రాశులు ఇవే!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు, కుజుడు కలయిక కారణంగా నవ పంచమ రాజయోగం ఏర్పడనుంది. జాతకంలో రాహువు ఐదవ స్థానంలో, కుజుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఇది శుభయోగం. ఈ శుభయోగం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు నవ పంచమ రాజయోగంతో జాక్పాట్ ను అందుకుంటారు.
నవ పంచమ రాజయోగంతో విశేష ప్రయోజనాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ 20న కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. కుజుడు కర్కాటక రాశిలోకి వెళ్లడం వల్ల రాహువు , కుజుడు కర్కాటక రాశిలో పరస్పరం 9వ మరియు 5వ ఇండ్లలో ఉండడం వల్ల నవపంచమ యోగం ఏర్పడుతుంది. నవ పంచమ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధున రాశి
నవ పంచమ రాజయోగం కారణంగా మిధున రాశి జాతకులకు వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇది వీరికి ఆర్ధిక లాభాలను కలిగించే కాలం. ఈ సమయంలో వీరు అనేక సమస్యల నుంచి బయటపడతారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను ఇస్తాయి.
కష్టానికి తగిన ఫలితం
ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా విభేదాలు ఉంటే తొలగిపోతాయి. ఈ సమయంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పనిసరిగా పొందుతారు. ఆర్ధికంగా లాభ పడతారు. నూతన ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. మీరు వృత్తిలో గణనీయమైన ప్రయోజనాలు పొందుతారు.
కన్యా రాశి
నవ పంచమ రాజయోగం కారణంగా కన్యా రాశి వారికి ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో కన్యా రాశి జాతకులు రాహువు యొక్క క్రియాశీలత కారణంగా సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. పెళ్ళిళ్ళు కానివారికి ఉన్నవారు వివాహ ప్రతిపాదనను పొందవచ్చు.
నూతన ఆదాయ వనరులు
కన్యా రాశి జాతకులకు రాహువు శని మరియు కుజుడు యొక్క ప్రభావాల నేపధ్యంలో జీవితంలో కొనసాగుతున్న సమస్యలు ఇప్పుడే ముగుస్తాయి. మీరు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. నూతన ఆదాయ వనరులు తెరచుకుంటాయి. మీరు వ్యాపారం, ఉద్యోగం లేదా ఇతర మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నట్లయితే, అది ఇప్పుడు మీకు మంచి ప్రయోజనాలను ఇస్తుంది. అనుకున్న కోరిక నెరవేరుతుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications