ఆగస్ట్ 26 నుండి వీరు నక్కతోక తొక్కుతున్నారు.. రెడీ అవ్వండి!
నిర్దిష్ట రాశులలో నిర్దిష్ట గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ ఉంటాయి. గ్రహాలు సంచారం చేస్తున్నప్పుడు కొన్ని శుభ యోగాలను, కొన్ని అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. అన్ని రాశులపైన ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్ని యోగాలు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తే, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తాయి. ఆగస్టు 26వ తేదీన ఒక అద్భుతమైన యోగం ఏర్పడబోతోంది.
నవ పంచమ రాజయోగం
ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్న శని, మిధున రాశిలో సంచరిస్తున్న శుక్రుడు 120 డిగ్రీల కోణంలో ఉండడం వల్ల శని శుక్రులు నవ పంచమ స్థానాలలో ఉండడం వల్ల నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కారణంగా అదృష్టవంతులు అయ్యే రాశులు ఏమిటో మనం ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
నవ పంచమ రాజయోగం మేష రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికపరంగా బాగా లాభాలను చూస్తారు. ఈ సమయంలో వీరు నూతన భాగస్వామ్యంతో వ్యాపారాలను మరింత విస్తరిస్తారు. కుటుంబ సభ్యులతో ఏదైనా ట్రిప్ లకు వెళతారు. కొత్త కాంట్రాక్టులు చేతికి వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికపరంగా ను కలిసి వస్తుంది.
సింహరాశి
శని శుక్రుల కారణంగా ఏర్పడే నవ పంచమ రాజయోగం సింహరాశి జాతకులకు ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. ఈ సమయంలో సింహ రాశి జాతకులు సంతోషంగా జీవిస్తారు. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు శుభవార్తలు వింటారు. వివాహాలు కానీ వారికి వివాహ యోగం ఉంది. ప్రేమ జీవితం సంతోషంగా సాగుతుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఇది సింహ రాశి వారికి కలిసి వచ్చే కాలం.
మీన రాశి
మీనరాశి జాతకులకు నవ పంచమ రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. మీన రాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. మిమ్మల్ని ఇష్టపడే వారు మీకు సహాయం చేసే పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో మీన రాశి వారి విజయాలను అందుకుంటారు. కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం. .విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications