Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాఖీపౌర్ణమి నాడే నవపంచమ రాజయోగం.. వీరికి మహారాజయోగం!

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారాలు, గ్రహాల సంయోగాలు జరుగుతున్నాయి. వీటి ఫలితంగా శుభ, అశుభ యోగాలు ఏర్పడుతుంటాయి. గ్రహాలన్నింటికీ రాజుగా భావించే సూర్యుడు ప్రస్తుతం చంద్రునికి సంబంధించిన కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. రాఖీ పౌర్ణమి 2025 సందర్భంగా ఏర్పడే శుభ యోగాలు, సూర్యుడు మరియు శని ప్రభావంతో అదృష్టం కలిసొచ్చే రాశుల గురించి తెలుసుకుందాం.

రక్షాబంధన్ రోజు వీరికి అదృష్టం
జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు, శని గ్రహాలకు విశేష ప్రాధాన్యత ఉంది. శనిదేవుడు కర్మ దేవుడు, కర్మ ఫలితాలను అనుభవించేలా చేసే దేవుడు. క్రమశిక్షణకు మారుపేరు. ఇక సూర్యుడు తండ్రి స్థానాన్ని సూచిస్తాడు. సూర్యుడు, శని గ్రహాల కలయిక వల్ల నవపంచమ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం రక్షాబంధన్ రోజున కొన్ని రాశుల వారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సమయంలో ఆయా రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది.

navpancham rajyoga on raksha bandhan luck to these zodiac signs

మేషరాశి
రక్షాబంధన్ నాడు సూర్యుడు, శని కలయికతో ఏర్పడే నవపంచమ రాజయోగం మేషరాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. మేషరాశి వారికి ఏలినాటి శని కొనసాగుతున్నప్పటికీ శని తిరోగమనంలో ఉండడం వల్ల శని యొక్క ప్రతికూల ప్రభావం నుంచి ఉపశమనం కలుగుతుంది. జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. మేష రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. ప్రయాణాల ద్వారా లాభాలు పొందుతారు.

మిధున రాశి
రక్షాబంధన్ రోజు సూర్యుడు, శని కలయికతో ఏర్పడిన నవపంచమ రాజయోగం వల్ల మిధునరాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మిధునరాశి జాతకులు అన్ని విధాల లబ్ధిని పొందుతారు. సమస్యలు పరిష్కరించబడతాయి. శనిదేవుని దయవల్ల కోర్టు కేసుల నుంచి, అప్పుల నుండి, పాత రోగాల నుండి ఉపశమనం కలుగుతుంది. లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబజీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మీనరాశి
మీన రాశి వారికి నవ పంచమ రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీనరాశి జాతకులు ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. వర్తక వాణిజ్యాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులు లాభాలను ఆర్జించి వ్యాపారాన్ని విస్తరిస్తారు. డబ్బు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం వంటి అంశాలపైన సరైన నిర్ణయాలు తీసుకుంటారు. శనిదేవుని ఆశీస్సులతో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. విదేశీ పెట్టుబడులతో లాభాలు పొందే అవకాశం ఉంది. మీ ప్రయాణాలు ఫలిస్తాయి. ఈ సమయంలో ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+