వందేళ్ళ తర్వాత.. నవపంచమ యోగం.. ఈ రాశులవారికి సంపద వర్షం!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో కేతువు బృహస్పతి విభిన్నమైన స్వభావాలు కలిగినవి. కేతువును నీడగ్రహంగా చెబితే, బృహస్పతిని ప్రధాన గ్రహాలలో ఒకటిగా చెబుతారు. అయితే సుమారు 100 సంవత్సరాల తర్వాత కేతువు, బృహస్పతి శుభ స్థానాలలో ఉండడం వల్ల నవ పంచమ యోగం ఏర్పడుతుంది. సుమారు వందేళ్ల తర్వాత ఏర్పడుతున్న ఈ యోగం ముఖ్యంగా కొన్ని రాశుల వారికి శుభాలను చేకూరుస్తుంది.
నవ పంచమ యోగం ఏర్పడుతుంది ఇలా
బృహస్పతి, కేతువుల శుభకరమైన స్థానాల వల్ల నవ పంచమ యోగం ఏర్పడుతుంది. గత సంవత్సర కాలం నుంచి కేతువు కన్యారాశిలో సంచరిస్తుండగా, ప్రస్తుతం బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. అయితే జాతకంలో బృహస్పతి 9వ స్థానంలోనూ, కేతువు ఐదవ స్థానంలో ఉంటే నవ పంచమ యోగం ఏర్పడుతుంది. ఇది శుభయోగం. దాదాపు 100 సంవత్సరాల తర్వాత కేతువు, బృహస్పతి జాతకంలో 9వ 5వ ఇంట్లో నవ పంచమ యోగాన్ని ఏర్పరుస్తున్నాయి.

మిధున రాశి
నవ పంచమ యోగం కారణంగా మిధున రాశి జాతకులకు లబ్ధి జరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉన్నతాధికారులతో ప్రశంసలను పొందుతారు. ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే మిమ్మల్ని విజయం వరిస్తుంది. ఈ సమయంలో విలువైన వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
మకర రాశి
మకర రాశి జాతకులకు నవ పంచమ యోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. మకర రాశి జాతకులు ఈ సమయంలో పనిచేసే చోట సహోద్యోగుల నుండి, ఉన్నతాధికారుల నుండి పూర్తి సహకారాన్ని పొందుతారు. వీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అంటే ఇదే సరైన సమయం. ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం పొందుతారు.
వృషభ రాశి
నవ పంచమ యోగం కారణంగా వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. వృషభరాశి జాతకుల జీవితంలో ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ ప్రారంభమవుతాయి. ఈ సమయంలో సంపద వర్షం కురుస్తుంది. ఏదైనా నూతనంగా పనిని ప్రారంభించాలి అనుకునే వారికి ఇదే మంచి సమయం.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications