నవపంచమ యోగంతో ఈ మూడు రాశులవారికే దక్కింది కుబేరులయ్యే అదృష్టం

జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం, వివిధ గ్రహాల కలయిక విభిన్న యోగాలను ఏర్పరుస్తాయి. కొన్ని శుభ యోగాలు కాగా, మరికొన్ని అశుభ యోగాలు. మేలో బృహస్పతి, కేతువుల సంచారం వలన అత్యంత అనుకూలమైన శుభప్రదమైన నవ పంచమ యోగం ఏర్పడుతుంది. మే ఒకటవ తేదీన బృహస్పతి వృషభరాశిలోకి రవాణా జరిగింది. దీనికి విరుద్ధంగా కేతువు కన్యారాశిలో ఉన్నాడు. 2023 అక్టోబర్ 30నుండి కేతువు కన్యారాశిలో తిరోగమన దిశలో ఉన్నాడు.

నవ పంచమ యోగం ఏర్పడుతుందిలా
బృహస్పతి, కేతువుల స్థానం కారణంగా సింహరాశిలో నవ పంచమ యోగం ఏర్పడుతుంది. కుజుడు గాని, కేతువు గాని తొమ్మిదవ ఇంట ఉన్నప్పుడు, బృహస్పతి ఐదవ ఇంట్లో ఉంటే సింహరాశిలో నవ పంచమ యోగం ఏర్పడుతుంది. ఈ నవ పంచమ యోగం కారణంగా మూడు రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుంది. కుబేరుడి ఆశీస్సులతో సంపద వర్షం కురుస్తుంది.. ఆ రాశులు ఏమిటంటే

navpancham yoga gives good fortune with kubera blessings for three zodiac signs

వృషభ రాశి
నవపంచమ యోగం కారణంగా వృషభ రాశి జాతకులకు లబ్ధి చేకూరుతుంది. మీరు కొంత కాలంగా వాయిదా వేస్తున్న పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీ విశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసే లాభదాయకం. వృషభరాశి జాతకుల కెరీర్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పనిచేసేచోట మంచి గుర్తింపు లభిస్తుంది. పనిలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీకు కుబేర కటాక్షం, అదృష్టం వెన్నంటే ఉంటుంది.

సింహరాశి
సింహరాశి యొక్క పదవ ఇంట్లో నవ పంచమ యోగం ఏర్పడుతుంది. ఇది మీకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లాల్సి రావచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో ఇప్పుడు మీరు గణనీయమైన ప్రగతిని సాధిస్తారు. ఆర్ధికంగా బలంగా ఉంటారు. ఎంతోకాలంగా వసూలు కాని బాకీలు వసూలవుతాయి. న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకొని మీరు విజయం సాధించవచ్చు. మీ సొంతింటి కల నెరవేరే అవకాశం ఉంది. వాహనయోగం కూడా ఉంది.

మకర రాశి
నవ పంచమ యోగం కారణంగా మకర రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. పనిచేసే చోట ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ముఖ్యమైన ప్రాజెక్టులలో మీకు అవకాశం వస్తుంది. జీవితంలోని అన్ని కోణాలలో అద్భుతమైన విజయాన్ని మీరు అందుకుంటారు. మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి కొంత అవకాశం లభిస్తుంది. ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులతో బలమైన బంధాలను ఏర్పరచుకోవడంతో పాటు, ఈ సమయంలో ఆర్థికంగా మంచి ప్రయోజనాలను పొందుతారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+