త్వరలో నీచభంగ రాజయోగం... రాసి పెట్టుకోండి వీరికే అఖండ ధనయోగం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధుడికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మార్చి నెలలో బుధగ్రహం మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. మీనరాశిలో బుధ సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది. బుధ సంచారంతో మీనరాశిలో నీచ భంగ రాజయోగం ఏర్పడుతుంది. బుధుడు కమ్యూనికేషన్ మరియు వ్యాపార చతురతకు ప్రతీకగా నిలిచే గ్రహం. బుధుడు మిధున రాశిని, కన్యరాశిని పాలిస్తాడు.

నీచ భంగ రాజయోగం.. అదృష్ట రాశులు
బుధసంచారం ద్వాదశ రాశుల వారి జీవితాలలో వారి మేధస్సును, కమ్యూనికేషన్ ను ప్రభావితం చేస్తుంది. అటువంటి బుధుడు మార్చి నెలలో మీనరాశిలో సంచరిస్తున్న వేళ నీచ భంగ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగంతో మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతున్నారు. ఇక నీచ భంగ రాజయోగంతో నక్కతోక తొక్కే ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Neechbhang RajYoga in march wealth and happiness for these zodiac signs

మేషరాశి
మేషరాశిలో 12వ ఇంట్లో బుధ సంచారం జరుగుతుంది. మేషరాశిలో నీచభంగ రాజయోగం కారణంగా అన్ని శుభాలే జరుగుతాయి. మేషరాశి జాతకుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వీరు వృత్తి వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు. మేష రాశి వారి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి ప్రయోజనాలు వస్తాయి. మేష రాశి వారికి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.

వృషభరాశి
నీచ భంగ రాజయోగం కారణంగా వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. వృషభ రాశిలో బుధుడు 11వ ఇంట్లో సంచరించడం వల్ల ఈ సంచారం వారికి భారీ ధన లాభాలను తెస్తుంది. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. వర్తక వ్యాపారాలను విస్తరించడానికి ఇది మంచి సమయం. వృషభ రాశి వారికి కూడా ఆర్ధిక పురోగతి కనిపిస్తుంది. ఈ సమయంలో వీరి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మీనరాశి
నీచ భంగ రాజయోగం కారణంగా మీన రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. మీనరాశిలో లగ్న గృహంలో నీచభంగా రాజయోగం ఏర్పడడం వల్ల వీరికి అన్ని విధాలుగా కలిసివస్తుంది. వీరి వ్యక్తిత్వం ఈ సమయంలో మెరుగుపడుతుంది. వృత్తి జీవితంలో పెద్ద విజయాలను సాధించే అవకాశం ఉంటుంది. మీనరాశి వారి వర్తక వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కొత్త వ్యాపార భాగస్వామ్యాలు లాభాలను ఇస్తాయి. వివిధ ఒప్పందాల నుండి లాభాలను అర్జించే అవకాశం ఉంది. మీనరాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో మెరుగ్గా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+