ఈరోజు రాత్రి ఇవి పాటిస్తే 7 జన్మలకు డబ్బు లోటుండదు
హిందూ మతంలో కార్తీక పూర్ణిమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున దీపదానం చేయడంవల్ల పుణ్యం లభిస్తుంది. త్రిపురాసురుడు అనే రాక్షసుడు, మనుషులను, దేవతలు,మునులను హింసించడంతో వారంతా శివుడిని ప్రార్థించారు. అతణ్ని పరమ శివుడు సంహరించడంతో త్రిపురారి అని కూడా పిలుస్తారు. రాక్షసుణ్ని అంతం చేయడంతో దేవతలు సంతోషించి గంగా ఘాట్ కు వెళ్లి దీపాలు వెలిగించారు. అందుకే ఈ రోజును దేవ్ దీపావళి అని పిలుచుకుంటారు.
ఈ రోజున గంగా ఘాట్, ఇతర పుణ్యనదులు, చెరువుల్లో స్నానం చేయాలి. కార్తీక పూర్ణిమ రోజున కృత్తిక నక్షత్రంలో శివుని దర్శనం చేసుకుంటే జ్ఞానోదయం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. ఈరోజు దీపాలు వెలిగించడం, నదీస్నానాలు చేయడం, దాన ధర్మాలు చేయడంవల్ల 7 జన్మల వరకు డబ్బు కొదవ ఉండదు.

రాత్రిపూట చంద్రోదయం సమయంలో శివుడు, సంభూతి, సంతతి, ప్రీతి, అనుసూయ, క్షమా అనే ఈ ఆరు కృత్తికలను పూజించడం వల్ల పరమేశ్వరుడు పరమానందభరితుడవుతాడు. ఈ రోజు ఉపవాసం ఉండి, రాత్రిపూట వృషదానాన్ని అంటే ఆవు దూడను దానం చేయడం ద్వారా ఎవరైనా శివ స్థితిని పొందుతారు.
శ్రీమహావిష్ణువు చాతుర్మాసపు నిద్ర నుండి ఈరోజే మేల్కొంటాడని నమ్మకం.
ఈరోజున దీపాలను వెలిగించడం, దానం చేయడం ఎంతో కీలకమైంది. కాశీలో ఇంకా ముఖ్యం. కార్తీక పూర్ణిమ రోజున గంగా స్నానం, దీపదానం, హవన యాగాలు చేయడం వల్ల ప్రాపంచిక పాపాలు, తాపం తగ్గడంతోపాటు ఆహారం, డబ్బు, బట్టలు.. ఇలా ఏది దానం చేస్తే అంతకు రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతారు. ఈ రోజు స్నానం చేసేటప్పుడు, మొదట చేతులు, కాళ్ళను కడుక్కొని, ఆపై ఆచమనం చేసి, చేతిలో కుశతో స్నానం చేయాలి. దానం చేసేటప్పుడు చేతిలో నీళ్లతో దానం చేయడంతోపాటు యాగం, జపం చేస్తుంటే, మొదట సంఖ్యపై సంకల్పం చేసి, ఆపై జపం, యాగం మొదలైనవి చేయాలని పండితులు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications