మహిళలకు అదిరిపోయే శుభవార్త.. మీరు కోటీశ్వరులు అవ్వటం ఖాయం!

తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలమే లక్ష్యంతో మహిళల ఆర్థిక స్వావలంబనకు చర్యలు తీసుకుంటున్న రేవంత్ సర్కార్ ఇప్పటికే మహిళలతోటి ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు, డ్రోన్లు, పెట్రోల్ బంకులు, సూపర్ మార్కెట్లు, ఆర్టీసీ బస్సుల నిర్వహణ వంటి అనేక స్వయం ఉపాధి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇక తాజాగా మరో కీలకనిర్ణయం తీసుకుని మహిళలకు శుభవార్త చెప్పింది.

మహిళలు ఫర్టిలైజర్ షాప్ లు నిర్వహించుకోవడానికి లైసెన్సులు

గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలపరచాలి అనే లక్ష్యంతో స్వయం సహాయక సంఘాలకు ఎరువుల పంపిణీ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించిన ప్రభుత్వం మహిళలు ఫర్టిలైజర్ షాప్ లు నిర్వహించుకోవడానికి లైసెన్సులు ఇవ్వనుంది. రైతులు తమ గ్రామంలోనే ఎరువులు సులభంగా కొనుగోలు చేసుకునే వ్యవస్థ ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో చురుగ్గా పనిచేసే మహిళా సంఘాలను ఎంపిక చేసి ఫర్టిలైజర్ లైసెన్సులు ఇవ్వాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుంది.

fertilizer licenses to women Telangana govt to empower SHG women by giving fertilizer distribution responsibilities

మహిళా సంఘాలకు ఫర్టిలైజర్ లైసెన్సులు

మహిళా సంఘాలకు యూరియా యాప్ వాడకం పైన శిక్షణ కూడా ఇవ్వనుంది. మన రాష్ట్రంలో సుమారు 4.67 లక్షల మహిళా సంఘాలు ఉన్నాయని అంచనా. వీటిలో అర్హత ఉన్న మహిళా సంఘాలను ఎంపిక చేసి ఫర్టిలైజర్ షాపులు నిర్వహించడానికి లైసెన్సులు ఇవ్వనుంది. అంతేకాదు సంఘాల కోసం 8126 సొంత భవనాలను నిర్మించి, అక్కడే ఎరువుల నిల్వలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

పట్టణాలకు వెళ్లకుండానే గ్రామస్థాయిలోనే ఎరువులు

ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 40 లక్షల టన్నుల ఎరువులు సరఫరా అవుతున్నాయి. వ్యవసాయ సహకార సంఘాలు, ప్రైవేట్ దుకాణాల ద్వారా రైతులు వీటిని తీసుకుంటున్నారు. కానీ ఈ కొత్త పథకంతో రైతులు పట్టణాలకు వెళ్లకుండానే గ్రామస్థాయిలోనే ఎరువులు పొందే వీలుంటుంది. ప్రతి గ్రామంలోనూ అయిదు నుంచి 10 మహిళా సంఘాలు ఉండడంతో వాటిలో ఆసక్తి ఉన్న వాటిని ఎంపిక చేసి ఈ బాధ్యతను అప్ప చెప్పనున్నారు.

రంగారెడ్డి జిల్లాకు మహర్దశ.. రేడియల్ రోడ్ 2 నిర్మాణ పనులు స్పీడప్!
రంగారెడ్డి జిల్లాకు మహర్దశ.. రేడియల్ రోడ్ 2 నిర్మాణ పనులు స్పీడప్!

మహిళలకి ఆదాయవనరుగా ఫెర్టిలైజర్ లైసెన్స్ లు

ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా మొదటి కొన్ని జిల్లాల్లో అమలు చేసి, ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మహిళలకు ఆదాయ వనరుగా మారుతుందని, రైతులకు కూడా సౌకర్యాన్ని పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు. వ్యవసాయ శాఖ మరియు పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు ఈ మేరకు ప్రణాళికలను రూపొందించారు. ఏదేమైనా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషి అధికారంలోకి వచ్చిన నాటి నుండి అడుగడుగునా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+