తెలంగాణ రైతులకు బంపర్ ఆఫర్.. రూ.10 రూపాయలకే యూరియా!
Farmers: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు ఓ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై యూరియా కోసం ఎండలో గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు, అలాగని స్మార్ట్‌ఫోన్ చేతపట్టి యాప్‌లతో కుస్తీ పడాల్సిన పనీ లేదు. రైతన్నల ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం.. యూరియా బుకింగ్‌ను మరింత సులభతరం చేస్తూ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై నేరుగా మీ సేవ కేంద్రాలకు వెళ్లి చాలా ఈజీగా యూరియా బుక్ చేసుకోవచ్చు.
నిజానికి, యూరియా పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి, పారదర్శకత పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది యూరియా బుకింగ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. మొదట కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించి, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. అయితే సాంకేతికతపై అవగాహన లేకపోవడం, మొబైల్స్ వాడడం రాని నిరక్షరాస్యులైన రైతులకు ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవడం పెద్ద సవాలుగా మారింది. రైతుల ఈ కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం.. యాప్‌తో సంబంధం లేకుండా మీ సేవ కేంద్రాల ద్వారా కూడా బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.

మీ సేవ కేంద్రం ద్వారా యూరియా బుక్ చేసుకోవడం చాలా సులభం. మీ సేవ కేంద్రంలో కేవలం రూ. 10 చెల్లించి రైతులు యూరియా బుక్ చేసుకోవచ్చు. రైతు మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ధృవీకరించిన వెంటనే బుకింగ్ కన్ఫర్మ్ అవుతుంది. స్క్రీన్‌పై ఒక బుకింగ్ ఐడీ జనరేట్ అవుతుంది. ఈ ఐడీ 48 గంటల పాటు యాక్టివ్‌గా ఉంటుంది. రైతులు తమకు కేటాయించిన డీలర్ వద్దకు వెళ్లి, ఆ బుకింగ్ ఐడీ చూపించి, పేమెంట్ చేసి యూరియా బస్తాలను ఇంటికి తీసుకెళ్లవచ్చు.
స్మార్ట్‌ఫోన్ వాడడం తెలిసిన రైతులు సొంతంగా యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్‌తో యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. మీకు ఎన్ని బస్తాల యూరియా కావాలో సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం మీకు అందుబాటులో ఉన్న సమీప డీలర్‌ను ఎంచుకోవాలి. ఆ డీలర్ వద్దకు వెళ్లి డబ్బులు చెల్లించి యూరియా తీసుకోవచ్చు. బ్లాక్ మార్కెట్‌కు చెక్ పెట్టడంతో పాటు, రైతులకు సకాలంలో ఎరువులు అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.













Click it and Unblock the Notifications