సౌత్ ఇండియన్ ఫేవరెట్ స్నాక్ 'రిబ్బన్ పకోడీ'.. ఇలా చేస్తే కరకరలాడిపోద్ది..!

కాస్త వర్షం పడినా నోటికి వేడివేడిగా ఏదైనా తినాలని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారికి టక్కున గుర్తొచ్చే వంటకం పకోడీ.. ఓ వైపు వర్షం పడుతుంటే మరోవైపు వేడివేడి పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఎప్పుడూ ఒకే రకమైన పకోడీ చేసుకుంటూ ఉంటారు. ఆనియన్ పకోడీ, పాలకూర పకోడీ, క్యాబేజీ పకోడీ ఇలా అనేక రకాలుగా చేస్తూ ఉంటారు. అయితే రిబ్బన్ పకోడీ ఎప్పుడైనా చేశారా..? వాటితో పాటు ఇవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. తక్కువ నూనెతో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మరి సూపర్ టేస్టీ రిబ్బన్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? తయారీ విధానం ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

రిబ్బన్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే బియ్యం పిండి ఒకటిన్నర కప్పు, శనగపిండి అర కప్పు, పుట్నాల పిండి అర కప్పు, ఉప్పు రుచికి సరిపడా, కారం ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, నువ్వులు మూడు టేబుల్ స్పూన్ లు, నూనె రుచికి సరిపడా తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూస్తే ముందుగా మిక్సింగ్ బౌల్ లోకి తగినంత బియ్యం పిండి తీసుకోవాలి. అందులోనే అరకప్పు శనగపిండి, అర కప్పు పుట్నాల పిండి, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలపాలి.

ribbonpakodi Recipe South Indian Favorite Snack Ingredients and Easy Method South Indian snack

ఆ తర్వాత ఇందులోనే కచ్చా పచ్చాగా దంచుకున్న జీలకర్ర, నువ్వులు, నూనె వేసి మిక్సింగ్ చేయాలి. అనంతరం తగినన్ని నీళ్లు పోసి పిండిని మృదువుగా తడిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టంలో రిబ్బన్ ఆకారంలోని బిళ్లను పెట్టి పిండి వేయాలి. మరోవైపు కడాయిలో నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత జంతికల గొట్టంలోని పిండిని నూనెలో ఒత్తి వేయాలి. ఆ తర్వాత గరిటెతో మెళ్లగా తిప్పుతూ రెండు వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇలాగే పిండి మొత్తాన్ని రెడీ చేసుకుని చల్లారనిచ్చాక ఒక డబ్బాలో స్టోరేజీ చేసుకోవాలి. అంతే కరకరలాడే రిబ్బన్ పకోడీ రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+