న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టినవారు అదృష్టవంతులు!!
న్యూమరాలజీ ప్రకారం వ్యక్తి పుట్టిన తేదీ అతని జీవితం ఎలా ఉంటుంది? అతని వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? అనేది స్పష్టంగా చెబుతుంది. న్యూమరాలజీలో రాడిక్స్ సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. రాడిక్స్ సంఖ్య పుట్టిన తేదీల మొత్తం నుండి లెక్కించబడుతుంది. న్యూమరాలజీలో కొన్ని రాడిక్స్ సంఖ్యల ఆధారంగా ఆయా తేదీలలో జన్మించిన వ్యక్తులు అదృష్ట వంతులుగా పరిగణించబడతారు.
అలాంటి వారు ఎటువంటి లోటుపాట్లు లేకుండా జీవనం సాగిస్తారు న్యూమరాలజీ ప్రకారం ఏ రాడిక్స్ నెంబర్ లో పుట్టిన వారు అదృష్టవంతులో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఏదైనా నెలలో 4, 13, 22, 31 తేదీలలో పుట్టిన వారికి రాడిక్స్ నెంబర్ నాలుగు అవుతుంది. ఈ వ్యక్తులు అద్భుతమైన వ్యూహాలను రచిస్తారు. వారి ఆలోచన విధానం చాలా షార్ప్ గా ఉంటుంది.

నంబర్ 4 ఉన్న వ్యక్తులు చాలా కష్టపడి పనిచేస్తారు. కష్టపడి జీవితంలో విజయం సాధించే వ్యక్తులుగా ఉంటారు. వారు జీవితంలో చాలా పురోగతిని చూస్తారు. రాడిక్స్ సంఖ్య 5 ఉంటే ఏ నెలలోనైనా 5, 14, 23 తేదీలలో జన్మించిన వారికి వారు పదునైన మనస్సు గలవారు. ఒకేసారి చాలా పనులు చెయ్యగల మల్టీ టాలెంట్ ఉన్నవారిగా ఉంటారు.
రాడిక్స్ సంఖ్య 5 ఉన్నవారు మంచి వ్యాపారవేత్తలు. వారు పరిస్థితులు, విషయాలలో త్వరిత మార్పులను కోరుకుంటారు. వీరు ఏ పనినైనా ఎక్కువ సేపు చెయ్యలేరు. అలా చెయ్యాలంటే వారికి విసుగు వస్తుంది. 6,15, 24 తేదీలలో జన్మించిన వారి రాడిక్స్ సంఖ్య 6. 6 సంఖ్య శుక్ర గ్రహానికి సంబంధించింది.
శుక్రగ్రహం సంపదకు, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. అందువల్ల రాడిక్స్ సంఖ్య 6 ఉన్నవారి జీవితం ఆర్ధికంగా బాగానే ఉంటుంది. రాడిక్స్ నెంబర్ 7 వల్ల 7, 16, 25 ఈ తేదీలలో పుట్టినవారికి అద్భుతమైన నిర్ణయాధికారం ఉంటుంది. రాడిక్స్ సంఖ్య 7 ఉన్నవారిని అదృష్టవంతులుగా భావిస్తారు. జీవితంలో అడుగడుగునా అదృష్టం వారికి సహకరిస్తుంది. న్యుమరాలజీలో 7ను లక్కీ నంబర్ అంటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు -
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి! -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications