ధన త్రయోదశి నాడు శక్తివంతమైన యోగాలతో వీరికి జాక్ పాట్!
ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశినాడు ధన త్రయోదశి పండుగను ఘనంగా జరుపుకుంటాం. ధన త్రయోదశి రోజు ప్రతి ఒక్కరు కుబేరుడిని, లక్ష్మీదేవిని, ధన్వంతరిని పూజిస్తారు. ఈ సంవత్సరం ధన త్రయోదశి అక్టోబర్ 18వ తేదీన వస్తుంది. ఈ ధన త్రయోదశి నాడు కొన్ని ప్రత్యేకమైన యోగాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తున్నాయి.
ధన త్రయోదశి నాడు శక్తివంతమైన యోగాలు
ధన త్రయోదశి నాడు బ్రహ్మ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం రాత్రి వరకు ఉంటుంది. అలాగే ఎంతో విశేషమైన శివ వాస యోగం ఏర్పడుతుంది. శక్తివంతమైన ఈ రెండు యోగాల కారణంగా కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందుతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి ధన త్రయోదశి కలిసి వస్తుంది. ధన త్రయోదశి నాడు ఏర్పడే విశేష యోగాల కారణంగా మేషరాశి జాతకులు ఈ సమయంలో సంతోషంగా జీవిస్తారు. వీరు వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఎప్పటినుండో వసూలు కావలసిన మొండి బాకీలు వసూలవుతాయి. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మేషరాశి జాతకులు ఊహించని విధంగా ఆర్థిక లాభాలను పొందుతారు.
కన్యారాశి
ధన త్రయోదశి నాడు ఏర్పడే విశేష యోగాలు కన్యారాశి జాతకులను అదృష్ట జాతకులు గా మారుస్తున్నాయి. ఈ సమయంలో ఈ రాశి వారు ఎక్కువ లాభాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది మంచి సమయం. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పూర్వీకుల నుంచి ఆస్తి వస్తుంది. సంతోషంగా జీవిస్తారు. ఇది వీరికి ఆర్థిక పురోగతిని ఇచ్చే సమయం.
తులారాశి
తులా రాశి వారికి ధన త్రయోదశి నాడు ఏర్పడే శుభ యోగాలు అదృష్టాన్ని ఇస్తున్నాయి. ఈ సమయంలో ఈ రాశి వారు ప్రమోషన్లు పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది మంచి సమయం. తులారాశి జాతకులు కొత్త ప్రాపర్టీ లను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఈ రాశి వారు అన్ని విషయాలలోనూ సక్సెస్ ను అందుకుంటారు.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ధన త్రయోదశి నాడు ఏర్పడే విశేష యోగాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఈ రాశి వారు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. పాత పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications