వీరికి ఆకస్మిక ధనలాభాలను, జాక్ పాట్ లను ఇస్తున్న పారిజాతయోగం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా అనేక శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. అయితే జాతక చక్రంలో ఏర్పడే కొన్ని యోగాల కారణంగా కొందరు ప్రయోజనాలను పొందితే, మరికొందరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని యోగాలు మనిషి జీవితాన్ని ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్తాయి. అటువంటి యోగాలలో ఒకటైన పారిజాత యోగం సెప్టెంబర్ 21వ తేదీన ఏర్పడింది.

పారిజాత యోగం
ఈ పారిజాత యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఆర్థికంగా గణనీయమైన లాభాలు కలుగుతాయి. పారిజాత యోగంతో కొన్ని రాశుల వారు ఏ పని చేసిన శుభ ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం పితృపక్షాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో ఏర్పడిన పారిజాత యోగం ఏ ఏ రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

parijata yoga will gives these zodiac signs sudden money benefits and jackpots

మేష రాశి
మేష రాశి వారికి పారిజాత యోగం లాభాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో మేష రాశి జాతకులు తండ్రి వైపు నుండి ఆస్తులను పొందే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసేవారు మంచి పేరు ప్రఖ్యాతలు సాధించడమే కాకుండా ఉద్యోగాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ అంతా సత్ఫలితాలను ఇస్తుంది. ఇక స్నేహితులతో విందులు, వినోదాలలో పాల్గొని మేషరాశి జాతకులు బాగా హ్యాపీగా గడిపే సమయం ఇది.

మిధున రాశి
పారిజాత యోగం కారణంగా మిధున రాశి వారికి లబ్ధి జరుగుతుంది. మిధున రాశి జాతకులు ఈ సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణిస్తారు. విపరీతమైన పని ఒత్తిడి నుంచి ఈ సమయంలో ఉపశమనం కలుగుతుంది. వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మిధున రాశి జాతకులకు పారిజాత యోగం విజయాలను చేకూరుస్తుంది.

కర్కాటక రాశి
పారిజాత యోగం కారణంగా కర్కాటక రాశి జాతకులకు అన్ని విధాలుగా లబ్ధి చేకూరుతుంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు ఎప్పటి నుండో వసూలు కానీ మొండి బాకీలను సైతం వసూలు చేస్తారు. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. ఈ సమయంలో కోరుకున్న వారితో పెళ్లి కానివారికి వివాహం జరుగుతుంది.

మీనరాశి
పారిజాత యోగం కారణంగా మీనరాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీన రాశి జాతకులు విందులు, వినోదాలలో ఎక్కువగా పాల్గొంటారు. సోదరులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి, ఈ రాశి వారికి ఈ సమయంలో జాక్ పాట్ లు, లాటరీలు తగిలే అవకాశం ఉంది. అంతేకాదు భార్య వైపు నుండి ఆస్తి వచ్చే అవకాశం కూడా ఉంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+