పరివర్తిని ఏకాదశి 2023: విష్ణువుకు ఆగ్రహం తెప్పించే ఈ పనులు అస్సలు చెయ్యొద్దు!!
హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఇలా సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకమైన పేరు, ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే భాద్రపద మాసంలోని శుక్లపక్ష ఏకాదశి అంటే నేడు వచ్చిన ఏకాదశిని పరివర్తిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి ఈరోజు ఉదయం 7 గంటల 57 నిమిషాలకు ప్రారంభమైంది. రేపు ఉదయం 5 గంటల 2 నిమిషాలకు ముగుస్తుంది.
పరివర్తిని ఏకాదశి రోజున ఎవరైతే విష్ణుమూర్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వారికి వాజిపేయి యాగంలో లభించే పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేసినా, లేక తెలిసో తెలియక చేసిన పాపాలు కూడా పరివర్తన ఏకాదశి రోజున విష్ణు పూజతో అంతం అవుతాయని చెబుతారు. ఈ ఏకాదశినాడు ఉపవాసం ఉండి పూజ చేయడం వల్ల త్రిమూర్తులను పూజించిన ఫలాలు లభిస్తాయని చెబుతారు.

ఇక పరివర్తిని ఏకాదశి రోజున కొన్ని పనులు చేస్తే మాత్రం విష్ణుమూర్తికి కోపం వస్తుందని చెప్తున్నారు. అయితే నేడు చేయకూడని పనులను గురించి తెలుసుకుందాం. పరివర్తిని ఏకాదశి రోజున ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగితే, ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాడి నైనా సరే వట్టి చేతులతో పంపించకండి.
పరివర్తన ఏకాదశి రోజున మద్యం, మాంసం వంటివి ముట్టుకోకండి. ఒకవేళ అటువంటివి ఈరోజు చేస్తే అత్యంత దురదృష్టం వస్తుందని చెబుతున్నారు. పరివర్తిని ఏకాదశి రోజున గోళ్ళు, వెంట్రుకలు కత్తిరించకూడదు. షేవింగ్ చేయించుకోకూడదు. పరివర్తిని ఏకాదశి రోజున ఎవరికి హాని చేయకుండా ఉండాలి.
భగవంతుని స్తుతిస్తూ, మనసును పూర్తిగా విష్ణుమూర్తి పై లగ్నం చేసి ఆయనను కీర్తించాలి. పరివర్తిని ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులు ధరించాలి. దానధర్మాలు చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉపవాస దీక్షను ఆచరించి అత్యంత శ్రద్ధతో విష్ణుమూర్తిని పూజించడం వల్ల లక్ష్మీదేవి కరుణిస్తుంది. ఆర్థిక సంక్షోభాల నుండి బయట పడడానికి అవకాశం ఉంటుంది .
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications