పరివర్తిని ఏకాదశి 2024: అరుదైన శోభన్ యోగంలో ఇవి చేస్తే లక్ష్మీకటాక్షం!
హిందూ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 14వ తేదీన పరివర్తిని ఏకాదశి నిర్వహించుకుంటున్నాం. భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి ని ఎవరైతే విశేషంగా పూజిస్తారో వారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఈసారి పరివర్తిని ఏకాదశి నాడు అత్యంత అదృష్ట యోగమైన శోభన్ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ప్రకారం విష్ణుమూర్తిని ఎవరైతే పూజిస్తారో వారి ఇంటికి లక్ష్మీదేవి సంపదలను, సౌభాగ్యాన్ని, ఆనందాన్ని పంపుతుంది.
నేడు పరివర్తిని ఏకాదశి
సెప్టెంబర్ 13వ తేదీ రాత్రి 10:32 నిమిషాల నుండి పరివర్తిని ఏకాదశి ప్రారంభమై సెప్టెంబర్ 14 రాత్రి 8 గంటల 41 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఇక పరివర్తన ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఇల్లంతా గంగాజలంతో శుద్ధిచేసి విష్ణుమూర్తిని పూజించాలి. సూర్యునికి నీటిని సమర్పించాలి.

విష్ణువుకు ఇష్టమైన ఈ పనులు చెయ్యండి
విష్ణువుకు పసుపు పూలమాలను, తులసి ఆకుల మాలను వేసి అత్యంత భక్తిశ్రద్ధలతో నెయ్యి దీపం వెలిగించి పూజ చేసినట్లయితే విష్ణుమూర్తి తో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా ఉంటుంది. పరివర్తిని ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువుకి ఇష్టమైన పసుపు రంగు దుస్తులను పేదలకు పంచితే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఈరోజు మతపరమైన పవిత్ర గ్రంధాలను దానం చేసినా కూడా విష్ణుమూర్తి సంతోషిస్తాడు
ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు ఇలా చెయ్యండి
నేడు ఎవరైతే స్వీట్లను పాయసాన్ని పేదలకు దానం చేస్తారో.. వారికి అన్ని విధాల శుభం జరుగుతుంది. పరివర్తిని ఏకాదశి రోజున విష్ణుమూర్తికి కొన్ని వెండి నాణేలను సమర్పించి తరువాత వాటిని ఎర్రని వస్త్రంలో చుట్టి బీరువాలో భద్రపరచుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం దొరుకుతుంది.
లక్ష్మీ కటాక్షం కోసం ఇలా చెయ్యాలి
పరివర్తిని ఏకాదశి రోజు విష్ణుమూర్తికి పసుపు పూలహారాన్ని సమర్పిస్తే మంచి జరుగుతుంది. అంతేకాదు రావి చెట్టుకు పంచదార కలిపిన నీళ్లను సమర్పించి దీపారాధన చేస్తే కూడా ఆర్థిక ఇబ్బందుల నుండి, అప్పుల బాధ నుండి ఉపశమనం కలుగుతుంది. కుంకుమ కలిపిన పాలతో విష్ణువుకు అభిషేకం చేయడం కూడా నేడు మంచి ఫలితాలను ఇస్తుంది. మీకు లక్ష్మీ కతాక్షాన్ని అనుగ్రహిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications