పితృపక్షం 2024: రేపటి నుండి 15రోజులు ఈ పనులు చేశారా.. ఆర్ధిక నష్టాలు పక్కా!

సనాతన ధర్మం ప్రకారం పూర్వీకులకు అంకితం చేయబడిన సంవత్సరంలోని నిర్దిష్ట కాలాన్ని పితృ పక్షం అంటారు. పితృ పక్షం అంటే పూర్వీకులను స్మరించుకుంటూ వారిని గుర్తు చేసుకునే కాలం. పితృ పక్షం మొత్తం 15 రోజుల కాలం. పితృపక్షం సమయంలో పూర్వీకులు తమ వారిని కలవటం కోసం భూమి మీదకు వస్తారని సనాతన ధర్మం పాటించే వారు చాలా ధృడంగా నమ్ముతారు.

పితృ పక్షం సమయంలో మగవారు చెయ్యకూడని పనులు
ఈ సమయంలో స్నానం, దానం, తర్పణం, శ్రార్ధ కర్మలు చేసినప్పుడు పూర్వీకుల ఆత్మ సంతృప్తి చెంది తమ వారిని పూర్వీకులు ఆశీర్వదిస్తారని చెబుతారు. అయితే పితృ పక్షాల సమయంలో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ముఖ్యంగా మగవారు చెయ్యకూడని పనులు కూడా ఉన్నాయి. ఒకవేళ తెలిసీ తెలియక ఆ పనులు చేస్తే పూర్వీకుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.

Pitru paksam 2024 Don t Do these things for 16 days from tomorrow will face Financial losses

వీటికి దూరంగా ఉండాలి
పితృ పక్షాల సమయంలో మగవారు ఏం పనులు చేయకూడదు అంటే.. పితృ పక్షాల సమయంలో ఏవైనా శుభకార్యాలు చేయడం మంచిది కాదని చెబుతారు. పితృపక్షాల సమయంలో పురుషులు కొత్త వస్తువులను, కొత్త బట్టలను కొనుగోలు చేయడం కూడా మంచిది కాదని చెబుతున్నారు. పితృ పక్షాల సమయంలో సాత్విక ఆహారం తీసుకోవాలని, తామసిక ఆహారానికి దూరంగా, మద్యం, మాంసం తదితరాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.

ఇలా చెయ్యటం తప్పు, ఆర్ధిక నష్టాలు
పితృ పక్షాల సమయంలో ఎవరూ పొరపాటున కూడా జుట్టు కత్తిరించకూడదని, గడ్డం చేసుకోరాదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక నష్టం కలుగుతుందని అంటారు. పితృ పక్షం సమయంలో శ్రార్ధ,కర్మలకు వంట చేసే పాత్రల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, పొరబాటున కూడా ఇనుప వాటిని ఉపయోగించకూడదని చెబుతున్నారు. రాగి, ఇత్తడి పాత్రలను వంటకు ఉపయోగించాలని సూచిస్తున్నారు.

ఈ పనులు చేస్తే పితృ దేవతలకు నచ్చదు
నూతన గృహంలో గృహప్రవేశం చేయడం, కొత్త వ్యాపారం ప్రారంభించడం పితృ పక్షాల సమయంలో చేయకూడదని చెబుతున్నారు. ఆహారంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి చేర్చడం కూడా పితృ పక్షాల సమయంలో మంచిది కాదని చెబుతున్నారు. వివాహాలు చేసుకోవడం, కొత్తగా పుట్టిన బిడ్డకు శుభకార్యాలు చేయడం, పుట్టినరోజులు జరపడం మంచిది కాదు. కనుక పితృ పక్షాల సమయంలో చేయకూడని పనులను గురించి జాగ్రత్తగా తెలుసుకుని ఆ పనులకు దూరంగా ఉండాలి, పితృదేవతలకు ఆగ్రహం తెప్పించే పనులను చేస్తే ఆ కుటుంబానికి ఆర్థిక కష్టాలు తప్పవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+