పితృపక్షం 2023: పొరబాటున కూడా ఈ పనులు చెయ్యొద్దు.. అరిష్టం!!

పూర్వీకులకు అంకితం చేయబడిన సంవత్సరంలోని నిర్దిష్ట కాలాన్ని సనాతన ధర్మం ప్రకారం పితృ పక్షం అంటారని అందరికీ తెలిసిన విషయమే. పితృ పక్షం 16 రోజుల కాలం. పితృపక్షం సమయంలో పూర్వీకులు తమ వారిని కలవటం కోసం భూమి మీదకు వస్తారని చెప్తారు. ఈ సమయంలో స్నానం, దానం, తర్పణం, శ్రార్ధ కర్మలు చేసినప్పుడు పూర్వీకుల ఆత్మ సంతృప్తి చెంది తమ వారిని పూర్వీకులు ఆశీర్వదిస్తారని చెబుతారు.

అయితే పితృ పక్షాల సమయంలో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయని చెబుతున్నారు. పితృ పక్షాల సమయంలో ఏం పనులు చేయకూడదు అంటే.. పితృ పక్షాల సమయంలో ఏవైనా శుభకార్యాలు చేయడం మంచిది కాదని చెబుతారు. పితృ పక్షాల సమయంలో కొత్త వస్తువులను కొనుగోలు చేయడం కూడా మంచిది కాదని చెబుతున్నారు.

Pitrupaksam 2023: Dont do these things even by mistake.. Bad luck!!

పితృ పక్షాల సమయంలో సాత్విక ఆహారం తీసుకోవాలని, తామసిక ఆహారానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. పితృ పక్షాల సమయంలో ఎవరూ పొరపాటున కూడా జుట్టు కత్తిరించకూడదని, గడ్డం చేసుకోరాదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక నష్టం కలుగుతుందని చెబుతున్నారు. పితృ పక్షం సమయంలో శ్రార్ధ కర్మలకు వంట చేసే పాత్రలను ఇనుప వాటిని ఉపయోగించకూడదని చెబుతున్నారు.

రాగి, ఇత్తడి పాత్రలను వంటకు ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఆహారంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి చేర్చడం కూడా పితృ పక్షాల సమయంలో మంచిది కాదని చెబుతున్నారు. వివాహాలు చేసుకోవడం, కొత్తగా పుట్టిన బిడ్డకు శుభకార్యాలు చేయడం, పుట్టినరోజులు జరపడం, నూతన గృహంలో గృహప్రవేశం చేయడం, కొత్త వ్యాపారం ప్రారంభించడం పితృ పక్షాల సమయంలో చేయకూడదని చెబుతున్నారు.

కనుక పితృ పక్షాల సమయంలో చేయకూడని పనులను గురించి జాగ్రత్తగా తెలుసుకుని ఆ పనులకు దూరంగా ఉండాలని, పితృదేవతలకు ఆగ్రహం తెప్పించే పనులను చేసినట్లయితే ఆ కుటుంబానికి ఆర్థిక సంక్షోభం వస్తుందని చెబుతున్నారు.కాబట్టి పితృ దేవతలకు ఇష్టమైన పనులు మాత్రమే చేసి వారి ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా పొందాలి అనుకుంటే తప్పక ఏమి చెయ్యాలి చెయ్యకూడదు తెలుసుకోవాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+