శని అస్తమయంతో ఈ రాశులవారికి దరిద్రం మొదలైంది.. 40రోజులు జాగ్రత్త!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా శని గ్రహాన్ని క్రమశిక్షణకు మారుపేరుగా చెబుతారు. శని సహనాన్ని, ఓర్పును ఇచ్చే గ్రహం. మన కర్మ ఫలితాలను ఇచ్చే శని దేవుడు జాతకంలో ఉచ్చ స్థితిలో ఉంటే శుభాలు చేకూరుతాయి. నీచ స్థితిలో ఉంటే అశుభ ఫలితాలు వస్తాయి. శని ఆశీర్వాదం ఉన్నవారు ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాల నుంచి ఈజీగా బయటపడతారు.
శని అస్తమయం ... కొన్ని రాశులకు కష్టాలు
శని ఆశీర్వాదాలు లేకపోతే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫిబ్రవరి 28వ తేదీన శని అస్తమించాడు. శనిగ్రహం కుంభరాశిలో అస్తమించడం కారణంగా రానున్న 40 రోజులు కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు రాబోతున్నాయి. మళ్ళీ శని ఏప్రిల్ 8వ తేదీన ఉదయిస్తాడు. అయితే శని అస్తమయం కారణంగా ఇబ్బందులను ఎదుర్కొనే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేష రాశి
మేష రాశి వారు శని అస్తమయం కారణంగా 40 రోజులు పాటు జాగ్రత్తగా ఉండాలి. శని అస్తమయం మేష రాశి వారికి ఇబ్బందులను కలిగిస్తుంది. మేషరాశి జాతకులు ఖర్చులు విషయంలో జాగ్రత్తగా ఉండడంతో పాటు, పెద్దల సలహాలను కూడా పాటించాలి. ఇటు భవిష్యత్తులో కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మేష రాశి వారు పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
కర్కాటక రాశి
శని అస్తమయం కారణంగా కర్కాటక రాశి జాతకులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారు వివాదాలకు దూరంగా ఉండాలి. సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు లేని కారణంగా కర్కాటక రాశి వారు మాట్లాడే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
సింహరాశి
సింహరాశి జాతకులు 40 రోజుల పాటు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శని అస్తమయం కారణంగా ఉద్యోగులు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి. ఏ విషయంలోనూ అజాగ్రత్తగా ఉండకూడదు. ఖర్చులు కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి శని అస్తమయం కారణంగా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి నమ్మి ఎవరికి డబ్బులను ఇవ్వకండి.
కుంభరాశి
శని అస్తమయం కారణంగా కుంభరాశి వారికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఈ సమయంలో ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాలు చేసేవారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాస్త ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications