రాసిపెట్టుకోండి.. ఈ రాశులవారిదే సంపదలయోగం, సెలవిచ్చిన రాహుకేతువులు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో రాహువు, కేతువు గ్రహాలను నీడ గ్రహాలుగా, కీడు గ్రహాలుగా చెబుతారు . అయితే రాహు కేతువుల సంచారం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. కొన్నిసార్లు రాహు కేతువుల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తే మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి..
రాహు కేతు సంచారం
రాహు కేతువుల నక్షత్ర సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు చేకూరుతున్నాయి. మార్చి నెలలో రాహువు మీనరాశిలోనూ, కేతువు కన్యరాశిలోనూ సంచారాన్ని సాగిస్తున్నాయి. మార్చి 16వ తేదీన ఈ రెండు నక్షత్ర సంచారాన్ని సాగించబోతున్నాయి. రాహువు పూర్వాషాడ నక్షత్రంలోనికి, కేతువు ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో సంచారం చేయబోతున్నాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఊహించని లబ్ధి జరగబోతుంది మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
రాహువు పూర్వాషాడ నక్షత్ర సంచారం, కేతువు ఉత్తర ఫాల్గుణి నక్షత్ర సంచారం మేషరాశి వారికి అనేక ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులకు మంచి పేరు వస్తుంది. వ్యాపారస్తులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. పనిలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది.. మేష రాశి వారికి మంచి పేరు వస్తుంది.
కర్కాటక రాశి
రాహువు పూర్వాషాడ నక్షత్రానికి, కేతువు ఉత్తర ఫాల్గుణి నక్షత్రానికి చేరుకోవడం వల్ల కర్కాటక రాశి వారికి విజయాలు వస్తాయి. కర్కాటక రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శారీరకంగా కర్కాటక రాశి వారు ఆరోగ్యంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి ఇది అన్ని విధాలా మంచి సమయం.
తులారాశి
తులారాశి వారికి రాహువు పూర్వాషాడ నక్షత్రంలోకి, కేతువు ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల తులా రాశి వారు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ సమయంలో తులా రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పనిలో అడ్డంకులు తొలగిపోయి సజావుగా పనులు సాగుతాయి. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించిన వారు మార్చి నుండి వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. తులా రాశి వారికి మానసిక ప్రశాంతత కలుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications