వీరిని మహర్జాతకులను చేసిన రాహు శుక్రులు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గ్రహాలు సంచారం చేస్తూ వివిధ గ్రహాలతో సంయోగం చెంది అనేక యోగాలను కూడా ఏర్పరుస్తూ ఉంటాయి. కొన్ని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని లగ్జరీలకు అధిపతిగా భావిస్తారు. అటువంటి శుక్ర గ్రహం మీనరాశిలో సంచారం చేస్తున్నాడు.

శుక్ర, రాహు సంయోగం
మీనరాశిలో రాహువుతో సంయోగం చెంది సంచారం చేస్తున్న శుక్రుడు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తున్నాడు. జనవరి 28న రాహువు, శుక్రుల సంయోగం కారణంగా ముఖ్యంగా మూడు రాశుల వారికి సంపదల వర్షం కురుస్తుంది. సుఖవంతంగా జీవిస్తారు. వీరు ఈ సమయంలో ఏ పని చేసినా సానుకూల ఫలితాలు ఉంటాయి. ఇక ఆ రాశుల వివరాలలోకి వెళితే

Rahu and Venus are giving these zodiac signs a great life

కర్కాటక రాశి
రాహువు శుక్రుల కారణంగా కర్కాటక రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో శుభ ఫలితాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారు ఎటువంటి పనులలోనైనా విజయాలు సాధిస్తారు. ఇక ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. కర్కాటక రాశి వారికి ఇది పూర్తిగా అదృష్ట సమయం. ఈ సమయంలో విద్యార్థులకు మంచి జరుగుతుంది.

మిధున రాశి
మిధున రాశి వారు కూడా రాహు శుక్ర సంయోగం కారణంగా అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వస్తాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు లాభదాయకంగా ఉంటాయి. అనారోగ్య సమస్యల నుంచి మిధున రాశి వారికి ఈ సమయంలో విముక్తి లభిస్తుంది.

మీనరాశి
రాహువు, శుక్రుల సంయోగం కారణంగా మీన రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయం మీన రాశి వారికి అనుకూలమైనదిగా ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి పనులు చేసిన ఆర్థికంగా కలిసి వస్తుంది. మీన రాశి వారికి సంపాదనలో ఊహించని మార్పులు వస్తాయి. ఇది మీన రాశి వారికి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+