ఈ ఏడాదంతా ఈ రాశులవారికి రాహువు కటాక్షంతో ధనయోగం
వేద జ్యోతిష్య శాస్త్రంలో రాహు,కేతువులను నీడ గ్రహాలుగా చెబుతారు. రాహు కేతువులకు సొంత రాశి కానీ, ఇల్లు కానీ ఉండదు. ఈ రెండు గ్రహాలు జాతకంలో అత్యంత ప్రభావాన్ని చూపిస్తాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం రాహువు అశుభ స్థానంలో ఉంటే వారి జీవితం సర్వనాశనం అవుతుంది. రాహువును క్రూర గ్రహంగా పరిగణించడానికి ప్రధానమైన కారణం ఇదే అని చెబుతారు.
మీనరాశిలో తిరోగమనంలో రాహువు సంచారం
రాహువు ఒక రాశి నుండి మరొక రాశికి ప్రయాణం చేయడానికి 18నెలల కాలం పడుతుంది గత సంవత్సరం అక్టోబర్ 30వ తేదీన రాహువు మేష రాశి నుండి తిరోగమన స్థితిలో మీనరాశిలోకి ప్రవేశించాడు. మే18 2025 వరకు రాహువు అక్కడే ఉండి ఆ తర్వాత కుంభ రాశిలోకి వెళతాడు. అయితే రాహువు సంచార సమయంలో శుభ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా మూడు రాశుల వారికి లబ్ధి జరుగుతుంది.

వృషభ రాశి
రాహువు సంచారం వల్ల 2025 సంవత్సరం వరకు వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. వృషభ రాశిలో పదకొండవ ఇంట్లో రాహువు ఉండడం వల్ల ఈ జాతకులకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి, ఈ సంవత్సరంలో అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేస్తారు. వృషభ రాశి జాతకుల జీవితంలో ఈ సంవత్సరం సంతోషం నిండుతుంది. వర్తక, వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది.
మిధున రాశి
రాహువు సంచారం కారణంగా మిధునరాశి జాతకులకు 2025వరకు కలిసొస్తుంది. మిధునరాశి వారు తమ వృత్తిలో అపారమైన లాభాలను పొందడానికి వీలుంటుంది. మిధున రాశిలో రాహువు 9వ ఇంట్లో సంచరిస్తాడు. ఇది మిధునరాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ కాలంలో వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు కూడా ఇదే అనుకూలమైన సమయం. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. జీవితంలోని అన్ని రంగాలలోనూ వీరు విజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి
రాహువు సంచారం కారణంగా వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరం వరకు లాభదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశిలో రాహువు అయిదవ ఇంట్లో సంచరిస్తాడు. ఇది వారికి శ్రేయస్సును తీసుకువస్తుంది. ఈ సమయంలో వీరు తమ కుటుంబాలతో సంతోషంగా గడుపుతారు. వివిధ రంగాలలోనూ భారీ విజయాలను నమోదు చేస్తారు. కొత్త ఆదాయ వనరులకు మార్గం తెరుచుకుంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ఏకాగ్రత, తెలివితేటలు బాగా పెరుగుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
వాస్తు ప్రకారం కిచెన్లో పూజ చేయవచ్చా? -
ఉగాది నుండి వీరికి ధనయోగం.. బిజినెస్ అద్భుతం.. వృషభరాశి జాతకమిలా! -
మీన, కుంభ రాశులలో ముఖ్య గ్రహాలు.. వీరికి నేడు డబ్బులే డబ్బులు! -
పరాభవ నామ ఉగాది పంచాంగం.. మేషరాశి వారి జాతకం! -
ఉగాది నుండి అదృష్టం పట్టబోతున్న రాశులు ఇవే! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications