త్వరలో నక్కతోక తొక్కి సంపన్నులయ్యే రాశులు వీరే.. రాసి పెట్టుకోమన్న రాహువు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో రాహువుకు ఉండే ప్రత్యేకమైన స్థానం అంతా ఇంతా కాదు. నీడ గ్రహంగా, కీడు గ్రహంగా చెప్పుకునే రాహువు అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాడు. శని మాదిరిగానే రాహువు కూడా నిదానంగా కదిలే గ్రహం. ప్రస్తుతం మీనరాశిలో ఉన్న రాహువు మార్చి 16వ తేదీన ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి పూర్వాభాద్ర నక్షత్రానికి సంచారం చేస్తాడు.
పూర్వాభాద్ర నక్షత్రంలోకి రాహువు
తిరోగమన సంచారం చేసే రాహువు పూర్వాభాద్ర నక్షత్రంలోకి సంచరిస్తూనే కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలను చేకూరుస్తున్నారు. ఈ సమయంలో వీరికి అన్ని విధాలా కలిసి వస్తుంది. సంపదలు, సంతోషాలు వస్తాయి. బృహస్పతిచే పాలించబడే పూర్వాభాద్ర నక్షత్రంలో రాహువు సంచారం కారణంగా లబ్ధి పొందే రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభరాశి
వృషభ రాశి జాతకులకు పూర్వాభాద్ర నక్షత్రంలో రాహువు సంచారం ప్రయోజనం చేకూరుస్తుంది. వృషభ రాశిలో పదకొండవ ఇంట్లో రాహువు ఉండడం వల్ల ఈ రాశి జాతకులకు విజయం మరియు అదృష్టం వస్తుంది. వీరి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవితంలో అనేక అంశాలలో గణనీయమైన విజయాన్ని అందించే అవకాశం వృషభ రాశి జాతకులకు ఉంటుంది. వీరి సంపాదన కూడా సంతోషదాయకంగా ఉంటుంది.
మకర రాశి
పూర్వాభాద్ర నక్షత్రంలో రాహువు సంచారం మకర రాశిలో జన్మించిన వారిపై మంచి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వర్తక, వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించబడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. శారీరక భావోద్వేగ ఒత్తిడి రెండు తగ్గుతాయి. దీర్ఘకాలిక విజయాలకు అవకాశం ఉంటుంది.
మీనరాశి
పూర్వాభాద్ర నక్షత్రంలో రాహువు సంచారం లగ్న గృహంలో సంచరిస్తున్న కారణంగా మీనరాశి జాతకులకు విజయాలు వరిస్తాయి. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. సంపదలను పెంచుకునే అవకాశం ఉంటుంది. ఏ పని చేసిన విజయాలు వరిస్తాయి. సంతోషం, శాంతి వెల్లి విరుస్తుంది. జీవితం సంతృప్తికరంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications