సెప్టెంబర్ 21వరకు వీరికి సంపదల వర్షం ఖాయం చేసిన రాహువు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతీ గ్రహానికి దేనికదే ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులో రాహువుకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. రాహువును నీడ గ్రహంగా మరియు కీడు గ్రహంగా భావిస్తారు. రాహువు అన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపుతాడు. శనిలాగే రాహువు కూడా నెమ్మదిగా కదిలే గ్రహం. రాహువు నిదానంగా కదులుతూ అన్ని రాశులవారిని వారి స్థానాలను బట్టి శాసిస్తాడు.
పూర్వాభాద్రలో రాహువు
ప్రస్తుతం రాహువు మీనరాశిలో ఉన్నాడు. మార్చి 16న ఉత్తరాభాద్ర నక్షత్రం నుండి పూర్వాభాద్ర నక్షత్రానికి రాహువు సంచారం చేశాడు. రాహువు తిరోగమనంలో పూర్వాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించాడు. రాహువు పూర్వాభాద్ర నక్షత్రంలో సెప్టెంబర్ 21 వరకు ఉంటాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.
గురు గ్రహం ద్వారా పాలించబడే పూర్వాభాద్ర నక్షత్రంలో రాహువు సంచరించడం వల్ల ఏ రాశుల వారికి లాభం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి పూర్వాభాద్ర నక్షత్రంలో రాహువు సంచారం వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. వృషభరాశిలో రాహువు పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల ఈ రాశి వారికి అన్ని విధాలా విజయం, అదృష్టం కలిసి వస్తాయి. వీరి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవితంలో అనేక విషయాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. వీరి సంపాదన కూడా పెరుగుతుంది.
మకర రాశి
పూర్వాభాద్ర నక్షత్రంలో రాహువు సంచారం మకర రాశి వారికి కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మకరరాశి వారు సానుకూల ఫలితాలను పొందుతారు. వర్తక, వ్యాపారం చేసేవారికి లాభాలు వస్తాయి. చాలా కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. శారీరక మరియు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మకరరాశి వారు దీర్ఘకాలిక విజయాలు సాధించే అవకాశం ఉంది.
మీనరాశి
మీనరాశి వారికి పూర్వాభాద్ర నక్షత్రంలో రాహువు సంచారం వల్ల అనేక విజయాలు కలుగుతాయి. మీనరాశి వారికి ఈ సమయం శుభ ఫలితాలను ఇచ్చే సమయం. మీనరాశి వారికి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. సంపద పెంచుకునే అవకాశం ఉంది. ఏ పని చేసినా విజయం లభిస్తుంది. సంతోషం, శాంతి చేకూరుతాయి. జీవితం సంతృప్తికరంగా ఉంటుంది.
గమనిక: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడింది. దీనిని వన్ ఇండియా ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications