రాహు మహాదశ.. దుష్టగ్రహ ప్రభావం 18 ఏళ్ళపాటు.. ఏం జరుగుతుందంటే!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో రాహువు వంటి దుష్ట గ్రహాలకు నిర్దిష్టమైన స్థానం ఉంది. మొత్తం 12 రాశుల పైన రాహు మహాదశ మరియు అంతర్దశ యొక్క ప్రత్యేక ప్రభావాలు ఉంటాయి. ఇది రాశుల వారిపై అనుకూల మరియు ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. జాతకంలో రాహువు యొక్క స్థానాన్ని బట్టి, రాహువు మంచి స్థానంలో ఉంటే శుభ ఫలితాలు వస్తాయి. ఇక ప్రతికూల స్థానంలో రాహువు ఉంటే ప్రతికూల ఫలితాలు వస్తాయి.
మొత్తం రాహు మహాదశ జాతకుల జీవితాలలో 18 సంవత్సరాల కాలం ఉంటుంది. ఈ సమయంలో అన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. జాతకంలో రాహు మహాదశ ఉన్న సమయంలో వివిధ రాశుల వారు వారి చుట్టుపక్కల ఉన్న అలవాట్ల వల్ల ప్రభావితం అవుతారు. ఇతరుల గుణాలు, ఉద్దేశాలతో వారు ప్రభావితం అవుతారు. జాతకులలో దుర్గుణాలు ప్రేరేపించబడతాయి.

జాతకంలో రాహువు యొక్క సానుకూల స్థానం వ్యక్తుల యొక్క మొత్తం వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఇది రాశుల జాతకులు కూడా తమపై నమ్మకంగా ఉంటారు. తద్వారా వారి సమాజంలో మంచి పేరును సంపాదించుకుంటారు. సానుకూల స్థానంలో రాహువు ఉంటే రాజకీయ జీవితంలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది.
రాహువు సానుకూలంగా ఉంటే వివిధ రంగాల నుండి సరైన ఆదాయాన్ని ఆశించడానికి అవకాశం ఉంటుంది. జాతకంలో రాహువు యొక్క సానుకూల స్థానం కెరీర్ లో సరైన పురోగతిని ఇస్తుంది. ఇక ప్రతికూల ఫలితాలను ఇచ్చే స్థానంలో రాహువు ఉంటే అనేక అశుభ వార్తలు వినాల్సి వస్తుంది.
రాహు ప్రభావం కారణంగా జాతకులు ఇతరులను మోసం చేస్తారు. చెడు వ్యసనాలు అవకాశం ఉంటుంది .వారి జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. జాతకంలో రాహువు అశుభ స్థానంలో ఉంటే వివిధ అనారోగ్య సమస్యలు, పేగుల సమస్యలు, అల్సర్స్, పిచ్చి వంటి సమస్యలను కలిగిస్తుంది. రాహువు యొక్క అశుభ స్థానం జీవితంలో ఊహించని కష్టాలకు కారణమవుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications