మే నెలలో పులిపంజా చీల్చి సంపన్నులయ్యే రాశులివే.. రాహువు నిర్ణయం!

నవగ్రహాలలో రాహువు కు నీడ గ్రహంగా, చెడు చేసే గ్రహంగా పేరు ఉంది. సహజంగా రాహువు, కేతువు రెండు గ్రహాలు విడదీయ రానటువంటి గ్రహాలు. ఈ రెండు గ్రహాలు వివిధ రాశులలో సంచారం చేసినప్పటికీ రెండిటి పనితీరు ఒకే విధంగా ఉంటుంది. 2023 అక్టోబర్ చివరలో రాహువు మీన రాశిలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 2024 సంవత్సరం మొత్తం అదే రాశిలో రాహువు సంచారాన్ని సాగించాడు.

రాహు సంచారం
ఇక ఈ సంవత్సరం రాహువు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. రాహువు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి 18 నెలల సమయం పడుతుంది. మే 2025లో రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. కుంభరాశిలో రాహు సంచారం చాలా రాశుల వారికి మెరుగైన ప్రయోజనాలను కలిగిస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Rahu transit in aquarius These zodiac signs will become wealthy in May

వృషభరాశి
వృషభ రాశి వారికి రాహువు సంచారం కారణంగా లబ్ధి జరుగుతుంది. ఈ సమయంలో వృషభ రాశి జాతకులు మంచి పురోగతిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తారు. ఆర్థికంగా పురోభివృద్ధిని సాధిస్తారు. నూతన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ సమయం రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. వృషభ రాశి జాతకులు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు చదువులలో రాణిస్తారు.

కన్యారాశి
కన్యా రాశి వారికి రాహువు సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కన్యా రాశి వారికి ఆర్థిక పురోగతి కలుగుతుంది. కన్యా రాశి వారు పెద్ద లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి అనుకూల సమయం. ఆదాయంలో గణనీయమైన పురోగతి ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. పనిచేసే చోట పదోన్నతులు, వేతనాల పెంపు జరిగే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి
రాహువు సంచారం కారణంగా ధనుస్సు రాశి జాతకులు లబ్ధిని పొందుతారు. 2025 సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి చాలా బాగుంటుంది. పనిచేసే చోట ప్రమోషన్లు వస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి విజయాలను సాధిస్తారు. ధనుస్సు రాశి వారి కుటుంబ జీవితం ఈ సమయంలో సంతోషంగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+