నాలుగురోజుల్లో శని రాశిలోకి రాహువు.. వీరికి అదృష్టం తేనెతుట్టెలా పట్టుకుంటుంది!
వేద జ్యోతిషశాస్త్రంలో నవగ్రహాలలో రాహువును నీడ గ్రహంగా చెబుతారు . రాహువును చెడు చేసే గ్రహంగా కూడా చెబుతారు. అటువంటి రాహువు త్వరలో కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు. శని రాశి అయిన కుంభరాశిలో రాహువు మే 18వ తేదీన సంచరించబోతున్నాడు. శని మాదిరిగానే రాహువు నిదానంగా సంచరిస్తాడు.
కుంభరాశిలో రాహువు
రాహువు కుంభ రాశిలో సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకువస్తుంది. కుంభ రాశిలో రాహువు సంచారం కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఇస్తుంది. మరి రాహువు కారణంగా ప్రయోజనం పొందుతున్న ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
కుంభరాశిలో రాహువు సంచారం మేష రాశి జాతకులకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కుంభరాశిలో రాహువు సంచారం మేష రాశి వారికి ఆదాయం ఇస్తుంది. ఈ సమయంలో మేష రాశి వారి ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. సంపద పెరుగుతుంది. మేష రాశి వారు ఈ సమయంలో సుఖంగా జీవిస్తారు .
మిధున రాశి
మిధునరాశి జాతకులకు రాహువు సంచారం శుభ సంచారం కాబోతుంది. ఈ సమయంలో మిధునరాశి వారు ఏ పని చేసినా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆస్తులను, నూతన వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసే వారు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. ఎంతోకాలంగా పూర్తికాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. మిధునరాశి వారికి ఇది అదృష్ట సమయం అని చెప్పవచ్చు.
కర్కాటక రాశి
రాహువు సంచారం కారణంగా కర్కాటక రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. వీరికి కష్టానికి తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి సంతోషంగా జీవించే అవకాశం ఈ సమయంలో ఉంటుంది. సహోద్యోగులు సహకరిస్తారు. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. కొత్త పనులు మొదలుపెట్టి మీరు విజయాలు సాధించడానికి ఇది సరైన సమయం.
ధనుస్సు రాశి
రాహువు సంచారం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. రాహువు రాశి మార్పుతో ధనుస్సు రాశి వారికి మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారు కెరీర్లో దూసుకుపోతారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సద్దు మణిగి అంతా సంతోషంగా ఉంటారు. నూతన ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగాలు వస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications