నా మాటే శాసనం... శని రాశిలోకి వెళ్లి వీరికి అఖండ ధనయోగం ఇస్తానన్న రాహువు!
రాహువును నవగ్రహాలలో నీడ గ్రహం గాను, కీడు గ్రహం గాను భావిస్తారు. అటువంటి రాహువు త్వరలో శని రాశి అయిన కుంభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. రాహువు కుంభరాశిలో మే 18వ తేదీన సంచరిస్తాడు. శని మాదిరిగానే నిదానంగా సంచరించే రాహువు కుంభరాశి లోకి సంచరించడం కారణంగా కొన్ని రాశుల వారు అదృష్టవంతులుగా మారుతున్నారు.
శని రాశిలో రాహువు
కుంభరాశిలో రాహువు సంచారంతో మేష రాశి, మిధున రాశి, కర్కాటక రాశి, ధనుస్సు రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. వీరికి శని రాశిలో రాహువు సంచారం కారణంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి శని రాశిలో రాహువు సంచారంతో సానుకూల ఫలితాలు వస్తాయి. మేషరాశి వారు ఉద్యోగంలో రాణిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. మేష రాశి వారి వైవాహిక జీవితం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. సంపద పెరుగుతుంది. సంతోషంగా జీవిస్తారు.
మిధున రాశి
రాహువు సంచారం కారణంగా మిధున రాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. చివరికి రాహువు సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి గుర్తింపు వస్తుంది. ఎప్పటినుండో పూర్తికాని పనులు పూర్తవుతాయి. ఇది మిధున రాశి వారికి అదృష్ట సమయం.
కర్కాటక రాశి
రాహువు సంచారం కారణంగా కర్కాటక రాశి జాతకులు శుభ ఫలితాలను చూస్తారు. కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. సహోద్యోగుల సహాయంతో కొత్త పనులను మొదలుపెట్టి ముందుకు వెళతారు.
ధనుస్సు రాశి
రాహువు సంచారం కారణంగా ధనుస్సు రాశి జాతకులు అన్ని విధాల మంచి ఫలితాలను పొందుతున్నారు. రాహువు రాశి మార్పుతో ధనుస్సు రాశి వారికి ఊహించని లాభాలు ఉంటాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తోటి ఉద్యోగస్తుల సహాయంతో కెరియర్ లో దూసుకుపోతారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తొలగిపోయి అంతా సంతోషంగా ఉంటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications