నవరాత్రులలో అరుదైన కాలయోగం.. వీరి జీవితం నిత్యకళ్యాణం పచ్చ తోరణం!
వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం నవరాత్రుల సమయంలో శుక్రవారం ప్రత్యేకమైన యోగ ప్రభావాన్ని చూపిస్తుంది. దీనినే కాలయోగమంటారు. దీని ప్రభావంతో మూడు రాశుల వారికి లబ్ధి జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అలానే హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం దసరా శరన్నవరాత్రులకు చాలా మహత్యం ఉంటుంది.
అరుదైన కాల యోగం
శరన్నవరాత్రులలో దుర్గాదేవి వివిధ రూపాలలో భూమిమీద భక్తులను కరుణిస్తుంది. ఈ సమయంలో ఏ రోజుకు ఆ రోజు ప్రత్యేకమైన రోజుగా చెప్పబడుతుంది. ఇక దసరా శరన్నవరాత్రుల సమయంలో శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది. శుక్రవారం నాడు ఏర్పడే అరుదైన కాల యోగంతో ముఖ్యంగా మూడు రాశుల వారు అదృష్టవంతులుగా మారుతున్నారు. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

సింహరాశి
సింహ రాశి వారికి ఇది మంచి సమయం. సింహరాశి జాతకులకు అరుదైన రాజయోగంతో ఉద్యోగం చేసే చోట పురోగతి కనిపిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలను పొందే వీలుంటుంది. సింహరాశి వారికి ఈ సమయంలో ధన లాభం కలుగుతుంది. కుటుంబంలో సంతోషం శ్రేయస్సు వెల్లి విరుస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. నూతన వాహనాలు, ఇల్లు, ఆస్తులు వంటివి కొనుగోలు చేసే అవకాశం ఉంది.
కన్యారాశి
నవరాత్రులలో కన్యా రాశి వారి అదృష్టం మెరిసిపోతుంది. కన్యారాశి జాతకులు ఉద్యోగాలు చేసేవారు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఈ సమయంలో శుభవార్తలు వింటారు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారులు లాభాలను చూస్తారు. ఇది నిజంగా కన్యా రాశి జాతకులకు కలిసొచ్చే కాలం.
మకర రాశి
నవరాత్రులలో మకర రాశి వారి భవితవ్యం బాగుంటుంది. వీరి ఆదాయం బాగా పెరుగుతుంది. సంపదలతో సంతోషంగా బతుకుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. కుటుంబ కలహాలు పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో శత్రువులపై మీదే పై చేయిగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో మంచి విజయాలు సాధిస్తారు. ఈ సమయంలో ఏ పని చేసినా తిరుగే ఉండదు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications