అరుదైన షడష్టక యోగం: ఈ రాశులవారు జాగ్రత్త!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం అన్ని రాశుల వారి జీవితాలపైన గణనీయమైన ప్రభావాన్ని సూచిస్తుంటాయి. గ్రహాల రవాణాతో పాటు, కొన్ని గ్రహాల ప్రభావం కూడా రాశులవారి జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం సూర్యుడు మిధున రాశిలో సంచరిస్తున్నాడు. మరి కొద్ది రోజుల్లోనే సూర్యుడు తన రాశిని మార్చుకుంటున్నాడు. సూర్యుడు జులై 16వ తేదీన మిధున రాశి నుండి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు.

షడష్టక యోగం... ఈ రాశులకు నష్టాలు
సూర్య భగవానుడు కర్కాటక రాశిలోకి వెళ్లడం వల్ల అనేక రాశుల వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కానీ కర్కాటక రాశిలో సూర్యుడుతో పాటు శని కూడా కలిసి షడష్టక యోగాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. కర్కాటక రాశిలో సూర్యుడు, కుంభరాశిలో శని ఆరు, ఎనిమిది స్థానాల్లో ఉండటం వలన ఏర్పడే ఈ షడష్టక యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Rare Shadashtak Yoga these zodiac signs to be careful

వృషభ రాశి
కర్కాటక రాశిలో సూర్యసంచారం కారణంగా ఏర్పడుతున్న షడష్టక యోగం కారణంగా వృషభ రాశి వారికి ఆర్థిక నష్టాలు వస్తాయి. ఈ సమయంలో వృషభ రాశి వారికి ఆందోళనలు పెరుగుతాయి. వృషభ రాశి జాతకులు షడష్టక యోగం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా తీసుకోవాలి.

తులారాశి
షడష్టక యోగం కారణంగా తులా రాశి జాతకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ రాశుల వారికి ఆదాయం విషయంలో అంతా అనుకూలంగానే ఉన్నప్పటికీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో ఎవరినీ నమ్మకూడదు. తులా రాశి వారికి షడష్టక యోగం సానుకూల ఫలితాలను ఇవ్వబోదు.

కన్యారాశి
కన్యా రాశి వారికి కూడా షడష్టక యోగం ఇబ్బందులను తెచ్చిపెడుతుంది . కన్య రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఈ జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ యోగం కన్యారాశి జాతకులకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది.కనుక ఈ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా తీసుకోవాలి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+