178 సంవత్సరాల తర్వాత సూర్యగ్రహణం సమయంలో అరుదైన యోగం.. వీరిదే అదృష్టం!!
ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14వ తేదీన సంభవించనుంది. ఈ ఖగోళ సంఘటన అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈసారి చాలా అరుదైన అత్యంత అనుకూలమైన మరో సంఘటన అక్టోబర్ 14వ తేదీ సూర్య గ్రహణం నాడే సంభవించనుంది.
దాదాపు 178 సంవత్సరాల తర్వాత అరుదైన అత్యంత అనుకూలమైన ఖగోళ అమరిక ఏర్పడింది. సూర్యగ్రహణం నాడే పితృ అమావాస్య కావడం, అదే రోజు సూర్యుడు మరియు బుధుడు కన్యారాశిలో ఉండడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల ఐదు రాశుల వారి జీవితాలలో అదృష్టం ప్రకాశిస్తుంది.

సర్వ పితృ అమావాస్య రోజు సూర్య గ్రహణం సమయంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల మిధున రాశి జాతకులకు కలిసొస్తుంది. మిధున రాశి వారి ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. వీరి జీవితంలో ఆనందం శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. ఏ పని చేసిన వీరు ఆర్థిక లాభాలను పొందుతారు.
సింహరాశి జాతకులు ఈ సమయంలో గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు కూడా ఈ సమయంలో వారికి కలిసొస్తాయి. ఈ సమయంలో శత్రువుని మీరు ధీటుగా ఎదుర్కో గలుగుతారు. కుటుంబంతో కలిసి సంతోషంగా వెళ్లడానికి అవకాశం ఉంది. తులారాశి వారికి చివరి సూర్యగ్రహణం సమయంలో ఏర్పడే బుధాదిత్య యోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ బుధాదిత్య యోగం వల్ల వీరికి సంపద మరియు పేరుప్రతిష్టలు కలుగుతాయి. సామాజిక గుర్తింపు వస్తుంది.
తులా రాశి జాతకులు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. అదృష్టం వీరి పక్కనే ఉంటుంది. మకర రాశి జాతకులకు సూర్య గ్రహణం నాడు ఏర్పడే బుధాదిత్య యోగం కలిసొస్తుంది. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సహకారం లభిస్తుంది.వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరు ఈ సమయంలో చేసే ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి కుటుంబ సహకారం లభిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications