Today rasi phalalu: ఈ రాశులవారికి ధైర్యే సాహసే లక్ష్మి!!
నేడు తులారాశి నుంచి మీన రాశి వరకు ఆరు రాశుల వారికి జాతకం ఏ విధంగా ఉండబోతుంది. వీరి జాతకాన్ని గ్రహాల గమనం ఏవిధంగా మారుస్తుంది. ఈ ఆరు రాశులలో ఎవరికి కలిసొస్తుంది? ఎవరిని దురదృష్టం వెంటపడుతుంది? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
తులారాశి
తులారాశి జాతకులు ఈరోజు దూర ప్రయాణాలు చేయడం మానుకుంటే మంచిది. తులా రాశి జాతకులకు నేడు ఆర్ధికంగా మందకొడిగా ఉంటుంది. నేడు ప్రేమించే వారితో వివాదాలు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పనిచేసే చోట ఒత్తిడి ఎదురయ్య అవకాశం ఉంది ధైర్యంగా ఎదుర్కోండి. ఈరోజు మీ బంధువుల వల్ల గాని సన్నిహితుల వల్ల గాని వైవాహిక జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.

వృశ్చిక రాశి
ఈరోజు వృశ్చిక రాశి జాతకులు ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఈరోజు సొంత నిర్ణయాలు తీసుకోకుండా,పెద్దల సలహాలు సూచనలు తీసుకుని పనులు చేయండి. జీవిత భాగస్వామితో ఇబ్బందుల వల్ల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. అనుకోని బిల్లులు ఖర్చులు విపరీతంగా పెంచుతాయి. పిల్లల ఆరోగ్యం ఆందోళనకు గురిచేస్తుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు ఈరోజు ప్రారంభం అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల నేడు డబ్బులు వృధాగా ఖర్చు చేయాల్సి వస్తుంది. మీకు ఇది ఇబ్బందిని కలిగిస్తుంది. ఉద్యోగం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి చెప్పే మాటలను లక్ష్య పెట్టరు. అయితే జీవిత భాగస్వామికి ప్రేమను వ్యక్తం చేసే విషయంలో వినూత్నంగా వ్యవహరిస్తారు.
మకర రాశి
మకర రాశి జాతకులకు ఈరోజు ఎదురు చూస్తున్న పెండింగ్ బకాయిలు అందుతాయి. మీకు బాగా ఇష్టమైన వారి నుంచి ఈరోజు మీకు కాల్ అందుతుంది. పనిపై ధ్యాస పెడితే ఈ రోజు మీరు రెట్టింపు ఫలితాలను అందుకుంటారు. మీ జీవిత భాగస్వామి యొక్క మూడ్ ఈ రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. పాత మిత్రులను కలుసుకుని నేడు మీరు సంతోషంగా ఉంటారు.
కుంభరాశి
కుంభ రాశి జాతకులకు నేడు అంత అనుకూలంగా లేదు. అభద్రతాభావం, ఏకాగ్రత లేకపోవడం వంటి కారణాలతో నేడు మీరు నిర్లిప్తంగా ఉంటారు. పిల్లల అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఏ చిన్న నిర్లక్ష్యం చేసిన అది పెద్ద సమస్యగా మారుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు, ప్రాజెక్టులు సత్ఫలితాలు కంటే ప్రతికూల ఫలితాలను ఎక్కువ ఇస్తాయి. ఈరోజు జీవిత భాగస్వామితో సమయం గడిపే అవకాశం ఉంది.
మీన రాశి
మీన రాశి జాతకులు ఈరోజు డబ్బులను ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘ కాలంలో సక్సెస్ అవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పైన దృష్టి సారించాలి. మీ జీవితంలో అత్యుత్తమ సాయంత్రాన్ని ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడిపే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు! -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
జన్మ నక్షత్రం రోహిణి, మృగశిర, ఆరుద్ర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఇంట్లో డస్ట్‌బిన్ ఎక్కడ పెడుతున్నారు? -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications