ఫాల్గుణమాసంలో నెలంతా 12 రాశులవారికి శుభఫలితాలకు పరిహారాలు!!
ఉత్తర భారతదేశంలో సూర్యమానం ప్రకారం ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభమైంది. ఫాల్గుణ మాసం మార్చి 25వ తేదీ వరకు కొనసాగుతుంది . ఈ ఫాల్గుణ మాసంలో అనేక హిందూ పండుగలు వస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో మహాశివరాత్రి, హోలీ వంటి పర్వదినాలు ఫాల్గుణ మాసంలోనే నిర్వహిస్తారు. ఇక దక్షిణ భారతదేశంలో చాంద్రమానం ప్రకారం మార్చి 11 వ తేదీన ఫాల్గుణ మాసం మొదలవుతుంది.
ఇక ఈ క్రమంలో ఈ మాసంలో 12 రాశుల వారు మంచి ఫలితాల కోసం చేయవలసిన పరిహారాలను ఇక్కడ తెలుసుకుందాం. ఫాల్గుణ మాసంలో మేషరాశిలో ఉన్నవారు ఇంటి నుండి బయలుదేరే ముందు చక్కెర కలిపిన నీళ్లను తాగాలి. ఈ మాసంలో వీరు తమ తల్లుల సేవ చేయాలి, వారి నుండి ఆశీర్వాదాన్ని పొందాలి.

ఫాల్గుణ మాసంలో వృషభ రాశి వారు ఇంటికి ఈశాన్య మూలలో నెయ్యి దీపం వెలిగించి, ప్రతిరోజు కనకధారా స్తోత్రం పారాయణం చేస్తే సత్ఫలితాలు వస్తాయి. ఫాల్గుణ మాసంలో మిధున రాశి వారు పేదలకు పెరుగు మరియు పాలు అందించాలి. ప్రతిరోజు శివుడికి నీటిని సమర్పించాలి. ఫాల్గుణ మాసంలో కర్కాటక రాశి వారు చంద్రకాంతిలో కూర్చొని ప్రతిరోజు 108 సార్లు చంద్రుని మంత్రాలను జపించాలి. పాలు, పెరుగు దానం చేయాలి.
ఫాల్గుణ మాసంలో సింహ రాశి వారు సూర్యభగవానుడికి కొద్దిగా బెల్లం కలిపిన నీళ్లను సమర్పించాలి. లక్ష్మీదేవిని ప్రతిరోజు పూజించాలి. కన్యా రాశి వారు ప్రతిరోజు ఆవులకు ఆకుకూరలు తినిపించాలి. లక్ష్మీదేవిని ఎర్రటి పువ్వులతో ప్రతిరోజు పూజించాలి. ఫాల్గుణ మాసంలో తులారాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించాలి. పరమశివుని తప్పనిసరిగా పూజించాలి.
వృశ్చిక రాశి వారు ఫాల్గుణ మాసంలో చంద్రుడికి పచ్చిపాలు మరియు నీరు కలిపి నైవేద్యంగా నివేదించాలి. చంద్రుడి మంత్రాలను పఠించాలి. ధనుస్సు రాశి వారు ఫాల్గుణ మాసంలో ప్రతిరోజు తులసి పూజ చేసి రోజు ఒక ఆకును సేవించాలి. ఫాల్గుణ మాసంలో మకర రాశి వారు తమ తల్లులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎర్రటి పూలతో లక్ష్మీదేవిని పూజించాలి.
కుంభ రాశి వారు ఫాల్గుణ మాసంలో ప్రతిరోజు శివుని ఆరాధించాలి. శివలింగానికి నీటిని సమర్పించేటప్పుడు ఓం నమశ్శివాయ మంత్రాన్ని జపించాలి. పేదలకు నల్ల రంగు దుస్తులను దానం చేయాలి. ఫాల్గుణ మాసంలో మీన రాశి వారు తెల్ల చందనం నెయ్యి పాలు మరియు పెరుగు వంటి వస్తువులను పేదలకు లేదా దేవాలయాలలో దానం చేయాలి. ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయాలి. నుదుటిపై తెల్లని విభూతిని ధరించాలి.
-
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications