శక్తివంతమైన రుచకయోగంతో వీరికి మహారాజయోగం!
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం జనవరి నెలలో కుజ గ్రహం ప్రత్యేక స్థితిలో సంచారం చేయడం వల్ల శక్తివంతమైన రుచక రాజయోగం ఏర్పడుతోంది. కుజ గ్రహాన్ని ధైర్యసాహసాలకు, పరాక్రమానికి, శక్తికి, భూమికి కారకుడిగా చెబుతారు. ప్రతి 45 రోజులకు కుజుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాడు.
రుచక రాజయోగం
అటువంటి కుజుడు జనవరి 16వ తేదీన ఉచ్ఛ రాశి అయిన మకర రాశిలోకి సంచారం చేస్తున్నాడు. దీని కారణంగా రుచక రాజయోగం ఏర్పడుతుంది. ఇది పంచ మహాపురుష యోగాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం, అధికారం, ఆర్థిక లాభాలు లభించే అవకాశాలు ఉన్నాయి.

మేషరాశి
రుచక రాజయోగం కారణంగా మేష రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. రుచక రాజయోగం మేషరాశిలో పదవ స్థానంలో ఏర్పడుతుంది. దీనివల్ల నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఈ సమయంలో మేషరాశి వారికి సమాజంలో స్థాయి పెరుగుతుంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఏదైనా సరే మంచి పని చేయాలనుకున్నప్పుడు ఈ సమయంలో ప్రారంభించడం మంచిది.
తులారాశి
రుచక రాజయోగం కారణంగా తులా రాశి జాతకులకు ఈ రాజయోగం తులారాశిలో నాలుగవ గృహంలో ఏర్పడుతుంది. దీని కారణంగా మీకు భౌతిక సుఖాలు కలుగుతాయి. ఉద్యోగరీత్యా, సామాజిక జీవనంలోనూ లబ్ధి చేకూరుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి. వాహనాలు లేదా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో బంధం బలపడుతుంది. ముఖ్యంగా తల్లితోను, అత్తగారి తరపున వారితోను అనుబంధం దృఢంగా మారుతుంది.
మీన రాశి
రుచక రాజయోగం కారణంగా మీనరాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. మీనరాశిలో ఈ రాజయోగం ఆదాయ మరియు లాభ స్థానంలో జరగడం వల్ల ఆదాయంలో గణనీయమైన వృద్ధి జరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు ఈ సమయంలో కనిపిస్తాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టిన లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులు సుఖశాంతులతో జీవిస్తారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. ఆస్తులకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications