వృశ్చిక రాశిలో కుజుడు సంచారంతో రుచక యోగం: మూడురాశులకు లక్ కిక్కిస్తుంది!!
గ్రహాల కదలికలు వివిధ రాశుల వారి జీవితాలపై ఎనలేని ప్రభావాన్ని చూపిస్తాయి. వృశ్చిక రాశిలో కుజుడు సంచరించడం వల్ల రుచక యోగ ఏర్పడుతుంది. వృశ్చిక రాశిలో కుజుడు నవంబర్ నెలలో సంచరిస్తాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు కలిగితే, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి.
వేద జ్యోతిష్య శాస్త్రంలో రుచక యోగాన్ని బలమైన పంచ మహాపురుష యోగం గా పరిగణిస్తారు. ఇక ఈ యోగం వల్ల సానుకూల ఫలితాలు వచ్చే రాశి జాతకులు కీర్తి, గౌరవం, పేరు ప్రతిష్టలను, సంపదలను పొంది సంతోషంగా జీవిస్తారు.నవంబర్ 16వ తేదీన ఉదయం 10:3 నిమిషాలకు వృశ్చిక రాశిలో కుజ సంచారం చోటు చేసుకుంటుంది. ఇది కొన్ని రాశుల వారికి అదృష్ట యోగాన్ని, అందించే రుచక యోగం ఏర్పడడానికి దారితీస్తుంది.

రుచక యోగం వల్ల మూడు రాశుల వారు అదృష్టాన్ని పొందుతారు. రుచక యోగం ఏర్పడడం వల్ల వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారంగా మారుతుంది. వారు ఏ పని అనుకున్న విజయాన్ని సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి ఇది చాలా ఉత్తమ సమయంగా చెప్పవచ్చు.
వృశ్చిక రాశి వారు పనిచేసే చోట పేరు ప్రతిష్టలతో పాటు ప్రమోషన్లు పొందుతారు. వర్తక వ్యాపారాలు, కొత్త ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం. అధిక లాభాలను ఆర్జించటానికి వృశ్చిక రాశి వారికి రుచక యోగం ఉపయోగపడుతుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారి జీవితంలో సానుకూలమైన మార్పులు వస్తాయి.
రుచక యోగం వల్ల అదృష్టాన్ని పొందే మరొక రాశి సింహ రాశి. సింహరాశి జాతకులు పెట్టిన పెట్టుబడులలో విజయాన్ని సాధిస్తారు. వాహనయోగం, ఆస్తి యోగం ఈ సమయంలో మెండుగా ఉంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారు, ఆ ఇబ్బందుల నుండి బయటపడి ఆర్థికంగా బలోపేతం అవుతారు.
సింహ రాశి వారు వ్యాపార రంగంలో ప్రముఖమైన ఒప్పందాలను ఈ సమయంలో ఏర్పరచుకుంటారు. వ్యాపారాలలో లాభాలను ఆర్జించడానికి ఇది సరైన సమయం. ఆస్తుల కొనుగోలుకు కూడా ఇది మంచి సమయం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా ఈ సమయంలో ఆశాజనకంగా ఉంటుంది.
రుచక యోగం వల్ల మకర రాశి జాతకులకు అదృష్టం తలుపు తడుతుంది. ఇది వీరికి అనేక సమస్యల నుంచి బయటపడటానికి సరైన సమయం. మకర రాశి జాతకులు జీవితంలో ఉత్తమ ఫలితాలను పొందడానికి అనువైన కాలం. ఉద్యోగాలు చేసుకునే వారికి అవకాశం ఉంది. పని చేసే చోట పేరు ప్రతిష్టలకు ఆస్కారం ఉంది. కుటుంబంలో ఆరోగ్యం సంతోష దాయకంగా ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ మద్దతు కూడా బాగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications