సంసప్తక్ యోగం: ఈ రాశులవారికి అప్పటివరకు కష్టాలు, పొంచిఉన్న ప్రమాదం!!

జ్యోతిష్య శాస్త్రంలో 2023 సంవత్సరం జులై 1వ తేదీన 1:52 నిమిషాలకు సింహరాశిలోకి కుజుడు ప్రవేశిస్తాడు. అయితే అప్పటికే కుంభ రాశిలో ఉన్న శనితో సింహరాశిలో ఉన్న కుజుడు సంసప్తక్ యోగాన్ని ఏర్పరుచుకున్నాడు. కుజుడు మరియు శని గ్రహాలు ఒకదానికి ఒకటి ఏడవ స్థానంలో ఉన్నప్పుడు సంసప్తక్ యోగం ఏర్పడుతుంది.

సాధారణంగా సంసప్తక్ యోగం అనుకూలమే అయినప్పటికీ శుభ మరియు అనుకూలం కాని గ్రహాలు కలిస్తే ఫలితాలు భిన్నంగా ఉంటాయి. దీనివల్ల జులై ఒకటవ తేదీ నుండి ఆగస్టు 18వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయని, వారికి ప్రమాదమని చెబుతున్నారు జ్యోతిష్యశాస్త్ర పండితులు.

Samsaptak Yoga:

మేషరాశి
సంసప్తక్ యోగం కారణంగా మేష రాశి జాతకులకు ప్రమాదమని చెబుతున్నారు. వీరు జాగ్రత్తగా ఉండాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలని, కారు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు రావచ్చని చెబుతున్నారు. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

కన్యారాశి
సంసప్తక్ యోగం కారణంగా కన్యారాశి జాతకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో కన్యారాశి జాతకులకు ఆర్థిక సమస్యలు ఉండవచ్చని చెబుతున్నారు. అనవసరమైన ఖర్చులను తగ్గించాలని, పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చేయాలని సూచిస్తున్నారు. ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలని, లేదంటే ఇబ్బంది పడవలసి వస్తుందని సూచిస్తున్నారు.

కర్కాటక రాశి
సంసప్తక్ యోగం కారణంగా కర్కాటక రాశి జాతకులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ ఎదుటి వారితో వాగ్వాదానికి దిగకుండా ఉండడం మంచిదని సలహా ఇవ్వబడింది. అతిగా మాట్లాడటం వల్ల సమస్యల్లో పడతారని హెచ్చరిస్తున్నారు. పని పైన దృష్టి పెట్టి శ్రద్ధగా పని చేసుకోవాలని, మాట్లాడే సమయంలో కచ్చితంగా ఆచితూచి మాట్లాడాలని సూచిస్తున్నారు.

మకర రాశి
సంసప్తక్ యోగం కారణంగా మకర రాశి జాతకులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వీరు డ్రైవింగ్ చేసే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా ఒత్తిళ్లు పెరుగుతాయని చెబుతున్నారు. ఈ సమయంలో ఆదాయం బాగా ఉన్నా, విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+