ఆగస్ట్ 18వరకు ఈ రాశులవారు జాగ్రత్త.. కష్టాలు తప్పవు!!

జులై 1వ తేదీన 2023 సంవత్సరంలో సింహరాశిలోకి కుజుడు ప్రవేశించాడు. అయితే అప్పటికే కుంభరాశిలో ఉన్న శనితో సింహరాశిలో ఉన్న కుజుడు అతి చండాల సంసప్తక్ యోగాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ సంసప్తక్ యోగం ఆగస్ట్ 18 వ తేదీ వరకు వివిధ రాశుల వారి జాతకాలపై ప్రాభావాన్ని కలిగిస్తుంది. ఈ అతి చండాల సంసప్తక్ యోగం వల్ల కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు.

కన్యా రాశి : సంసప్తక్ యోగం కారణంగా కన్యారాశి జాతకులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ సమయంలో కన్యారాశి జాతకులకు ఆర్థిక సమస్యలు ఉండవచ్చని చెబుతున్నారు. అనవసరమైన ఖర్చులను తగ్గించాలని, పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చేయాలని సూచిస్తున్నారు. ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలని, లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడవలసి వస్తుందని సూచిస్తున్నారు.

horoscope7

మకర రాశి : సంసప్తక్ యోగం కారణంగా మకరరాశి జాతకులు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మకరరాశి వారు సంసప్తక్ యోగం తో డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా ఒత్తిళ్లు పెరుగుతాయని, కుటుంబ విషయాలకు ఖర్చులు కూడా పెరుగుతాయని చెప్తున్నారు. ఆదాయం బాగా ఉన్నా, విపరీతంగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెబుతున్నారు. పాతవ్యాధులు పెరిగి ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.

మేషరాశి : సంసప్తక్ యోగం కారణంగా మేష రాశి జాతకులకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి ప్రయాణాలు చెయ్యటం ఈ సమయంలో ప్రమాదమని చెబుతున్నారు. వీరు జాగ్రత్తగా ఉండాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలని, కారు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు రావచ్చని చెబుతున్నారు. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

కర్కాటక రాశి : సంసప్తక్ యోగం కారణంగా కర్కాటక రాశి జాతకులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. కర్కాటకరాశి వారు ఎట్టి పరిస్థితులలోనూ ఎదుటి వారితో వాగ్వాదానికి దిగరాదని సలహా ఇవ్వబడింది. అతిగా మాట్లాడటం వల్ల సమస్యల్లో పడతారని హెచ్చరిస్తున్నారు. పని పైన దృష్టి పెట్టి శ్రద్ధగా పని చేసుకోవాలని, మాట్లాడే సమయంలో కచ్చితంగా ఆచితూచి మాట్లాడాలని సూచిస్తున్నారు. సంసప్తక్ యోగం సాధారణంగా అనుకూలమే అయినా ఇది అనేక రాశులకు ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. ఆగస్ట్ 18వరకు ఈ రాశులకు కష్టాలు తప్పవు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+