ఆగస్టులో వీరికి కష్టాలను తెస్తున్న శని సూర్యులు!!

ఆగస్టు నెలలో సూర్యుడు శని గ్రహాలు ఒకదానికొకటి ఎదురెదురుగా రావడం వలన సంసప్తక యోగం ఏర్పడుతుంది. శని కుంభరాశిలో సూర్యుడి నుండి 180 డిగ్రీల వద్ద ఉంటాడు. ఇక సూర్యుడు సింహరాశిలో శనికి ఎదురుగా ఉంటాడు దీనివల్ల సంసప్తక యోగం సంభవిస్తుంది.

సంసప్తక్ యోగం.. ఈ రాశులవారికి కష్టాలు
ఆగస్ట్ 16న ఇది సంభవిస్తుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని, మరికొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని కలిగిస్తుంది, సంసప్తక యోగం కారణంగా సింహరాశి, కుంభరాశి, తులారాశి జాతకులు అదృష్టాన్ని పొందుతుంటే,. మేష రాశి, మకర రాశి, మీన రాశి జాతకులు దురదృష్టవంతులుగా మారుతున్నారు. ఇక ఆగస్టు నెలలో కష్టాలు పడనున్న రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

Samsaptak Yoga with sun and saturn brings difficulties to these zodiac signs in August

మేష రాశి
సూర్యుడు, శని గ్రహాలు ఒకదానికి ఒకటి అభిముఖంగా రావడం వల్ల మేష రాశి జాతకులకు కష్టాలు రాబోతున్నాయి. ఈ సమయంలో మేషరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. కష్టపడి పని చేసిన ఫలితం గొప్పగా రాదు. ఉద్యోగాలలోను ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బు విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి
సంసప్తక్ యోగం కారణంగా మకర రాశి జాతకులకు సమస్యలు వస్తాయి. మకర రాశి జాతకులు ఏ పని చేసిన ఈ సమయంలో కలిసి రాదు. కోర్టు కేసులలో వివాదాలు మరింత పెరుగుతాయి. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి. మానసికంగా ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామితో వివాదాలు వస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేసే పనిలోనూ ఆటంకాలు ఉంటాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి
సంసప్తక్ యోగం కారణంగా మీన రాశి వారికి ఎక్కువ సమస్యలు వస్తాయి. ఈ సమయంలో మీన రాశి వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాలలో ఎవరినైనా గుడ్డిగా నమ్మితే వారు మోసం చేసే అవకాశం ఉంది. ఆస్తి సంబంధిత వివాదాలు పెరుగుతాయి. మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+