గుడి దగ్గర చెప్పులు పోతే శుభమా.. అశుభమా?

సాధారణంగా ఆలయాలకు వెళ్ళినప్పుడు చెప్పులు బయట విప్పి వెళతాం. అయితే చాలా సందర్భాలలో దైవ దర్శనం చేసుకుని బయటకు వచ్చి చూసిన తర్వాత చెప్పులు అక్కడ కనిపించవు. చాలా సందర్భాలలో ఆలయాల వద్ద బయట విడిచిన చెప్పులు దొంగతనానికి గురవుతాయి. అందుకు బాధ పడాల్సిన అవసరం లేదు.

ఇక చెప్పులు బయట విడిచిపెట్టి వెళ్ళేటప్పుడే చెప్పులు ఉంటాయో పోతాయో అన్న భయంతోనే ఆలయానికి వెళ్తారు. అయితే ఆలయాల వద్ద చెప్పులు పోతే బాధపడాల్సిన అవసరం లేదు. చెప్పులు విడిచేటప్పుడు పోతాయేమోనని ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు. ఒకవేళ ఆలయాల వద్ద మీ చెప్పులు చోరీకి గురైతే బాధ పడటం మానేసి సంతోషంగా ఉండొచ్చు. ఎందుకంటే ఆలయాల వద్ద చెప్పులు పోవడం మన జీవితంలో జరిగే శుభాలకు సంకేతం.

leavesandlesinfrontoftemple

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పులు పోవడాన్ని అదృష్టంగా చెప్పొచ్చు. చెప్పులు పోతే మన జీవితంలో శని బాధలు తొలగిపోతాయని చెబుతారు. చెప్పులు చోరీకి గురైతే అప్పుల బాధ నుండి బయటపడతామని, పేదరికం నుండి విముక్తి దొరుకుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా శనివారం రోజు ఆలయం వద్ద చెప్పులు పోతే మరీ మంచిదని చెబుతున్నారు. శనివారం నాడు ఆలయం వద్ద చెప్పులు దొంగిలించబడితే మన జీవితంలో ఉన్న దరిద్రం కూడా తొలగిపోతుందని చెబుతున్నారు.

చెప్పులను దానం చేయడం వల్ల, లేదా చెప్పులను ఎవరైనా తీసుకోవడం వల్ల శని వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని చెబుతారు. శనిగ్రహం పాదాలలో నివసిస్తుందని చాలామంది చెబుతుంటారు. అటువంటి పాదాలకు ధరించే చెప్పుల పైన శని యొక్క ప్రభావం ఉంటుందని చెప్తారు.

రంగులు మరియు తోలు రెండు శనిదేవుడికి సంబంధించినవి. కాబట్టి శని దేవుడి ప్రతికూల ప్రభావాల నుంచి బయట పడటం కోసం చాలామంది కావాలని ఆలయాల వద్ద శనివారం నాడు వారి బూట్లు, చెప్పులు వదిలివేస్తారు. దీనివల్ల తమ జీవితంలోని ప్రతికూల ఫలితాలు పోతాయని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల శని దేవుడు కలిగించే బాధల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు.

జాతకంలో శని వక్ర దృష్టి ఉంటే మనం ఎంత కష్టపడినా అనుకున్న పనులు జరగవు. అలాంటప్పుడు ఆలయాల వద్ద చెప్పులు ఎవరైనా చోరీ చేస్తే, లేదా మనమే చెప్పులు వదిలేస్తే కచ్చితంగా కష్టాలు తొలగిపోతాయని, ఆర్థిక ఇబ్బందులు లేకుండా పోతాయని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+