Sankranti 2024: సంక్రాంతి నాడు సూర్యుడు డబ్బు వర్షం కురిపిస్తాడు.. అందుకు చెయ్యాల్సిందిదే!!
మకర సంక్రాంతి పండుగ సమయం రానే వచ్చింది. ఈ సంవత్సరం జనవరి 15వ తేదీన జరుపుకుంటారు. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక మకర సంక్రాంతి పర్వదినాన చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్తారు. ముఖ్యంగా మకర సంక్రాంతి నాడు సూర్యుడిని పూజించటం కూడా ముఖ్యమైంది.
అయితే మకర సంక్రాంతి పర్వ దినాన మనం ఇంటికి ఒక వస్తువును తెచ్చి పెట్టుకుంటే ధన వర్షం కురుస్తుందని చెప్తున్నారు. మకర సంక్రాంతి పర్వదినాన దానాలు చెయ్యటంతో పాటు ఆ రోజు మన ఇంటికి సూర్య భగవానుడి ఇత్తడితో చేసిన ప్రతిమను తెచ్చి పెట్టుకుంటే ఇంట్లో శాంతి, శ్రేయస్సు, సంతోషం ఉంటాయని అంటున్నారు.

సూర్యుడికి మకర సంక్రాంతికి ఉన్న సంబంధం నేపధ్యంలో సూర్య భగవానుడి ప్రతిమ విషయంలో కూడా కొన్ని రకాల హ్యాంగింగ్స్ కూడా బాగా కలిసి వస్తాయని, ఇంటికి మంచి చేస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, అందరూ ఆయురారోగ్యాలతో జీవించాలంటే తూర్పు దిశలో ఇత్తడితో చేసిన సూర్యుడి ప్రతిమ కింద గంటలు వేలాడుతున్న హ్యాంగింగ్ పెట్టుకోవాలి.
గాలికి ఆ గంటలు మోగితే అది ఆ ఇంటికి శుభసూచకమని చెబుతున్నారు. ఇది ఇంట్లో సానుకూలతను తీసుకురావడమే కాకుండా రోగాల బారి నుండి కాపాడుతుంది. ప్రతికూలతలు రాకుండా చేస్తుంది. సంక్రాంతి పర్వదినాన రాగిపాత్రలో నీటితోపాటు ఎర్రటి పువ్వులను, అక్షింతలను వేసి సూర్యభగవానుడికి సమర్పించాలి. ఆపై 108 సార్లు సూర్యమంత్రాన్ని జపించాలి.
మకర సంక్రాంతి రోజు ఎవరైతే నిష్టతో సూర్యభగవానుడితో పాటు, విష్ణు మూర్తికి పూజ చేస్తారో అటువంటి వారు అనుకున్న పనులన్నీ సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయని చెబుతున్నారు. అంతేకాదు మకరసంక్రాంతి పుణ్యదినాన శుభ సమయంలో కావలసిన వారికి ఆహారం, దుప్పట్లు, నువ్వులు, బెల్లం, కిచిడి వంటివి దానం చేయాలని చెప్తున్నారు. ఇలా దానం చేయడం వల్ల ఆ కుటుంబ సభ్యులకు అనుకున్నవన్నీ నెరవేరుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications