Sankranti 2024: మకర సంక్రాంతి రోజున ఈ పనులు చేస్తే కష్టాలు తప్పవు.. జాగ్రత్త!!
మకర సంక్రాంతి త్వరలో రాబోతోంది. తెలుగువారు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగలలో మకర సంక్రాంతి ముఖ్యమైన పండుగ. ఈరోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. పురాణాల ప్రకారం చెప్పాలంటే సూర్యుడు తన కుమారుడైన శని ఇంటికి ఈరోజు వెళతాడు. సూర్యుడు శని ఇంటికి ప్రయాణం చేసిన సమయంలో మకర సంక్రాంతి ఏర్పడుతుందని చెబుతారు.
అయితే మకర సంక్రాంతి పర్వదినాన మనం ఏ పనులు చేస్తే ప్రతికూల ఫలితాలు కలుగుతాయనేది ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి. మకర సంక్రాంతి పర్వదినాన పొరపాటున కూడా మిగిలిపోయిన ఆహారాన్ని తినకూడదు. ఉదయాన్నే స్నానం చేసిన తరువాతనే ఆహారం తీసుకోవాలి. మకర సంక్రాంతి పర్వదినాన సాయంత్రం సమయాల్లో. రాత్రి వేళల్లో భుజించకూడదు.

ఈ విషయాలను ఎవరైతే పాటించరో వారిపై ప్రతికూల శక్తులు ఆధిపత్యం చెలాయిస్తాయి. మకర సంక్రాంతి పర్వదినాన పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. మసాలాలతో తయారు చేసిన నాన్ వెజ్ ఆహారాన్ని తింటే అది ప్రతికూల శక్తులకు ఊతమిస్తుంది. మకర సంక్రాంతి పర్వదినాన శాకాహార భోజనమే చేయాలి. ఆకుకూరలు. కూరగాయలతో తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తినాలి .
నాన్ వెజ్ తిన్నవారికి కోపం అధికమవుతుంది. ప్రకృతితో ముడిపడి ఉండే మకర సంక్రాంతి పండుగ నాడు ప్రకృతికి హాని తలపెట్టకూడదు. పండుగ రోజు ఎవరు పొరపాటున కూడా చెట్లు నరకకూడదు. అలా చేస్తే పాపం మన వెంటే వస్తుందని చెబుతారు . మకర సంక్రాంతి పర్వదినాన పేదలను, నిస్సహాయులను అవమానించడం చేయకూడదు. ఇలా చేస్తే పాపం వెంటాడుతుంది.
పొరపాటున కూడా చెడు మాటలు మాట్లాడకూడదు. ఇంటికి వచ్చిన వారిని రిక్త హస్తాలతో పంపకూడదు. సాధ్యమైనంత వరకు దానధర్మాలు చేయాలి. మకర సంక్రాంతి పర్వదినాన పశువుల నుండి పాలు పితకకూడదు. కనుమ రోజున మనం పశువులను పూజించుకుంటాం కాబట్టి ముందు రోజు పాలు పితకకూడదని దూడలకు పాలు వదిలేయాలని చెబుతారు.
ఇక మకర సంక్రాంతి పర్వదినాన సూర్యుడికి కోపం తెప్పించే ఏ పనులు చేయకూడదు. శని గ్రహానికి కూడా కోపం తెప్పించే పనులు చేయకూడదు. అలా చేస్తే తప్పనిసరిగా ప్రతికూల ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications